Saturday, November 14, 2009

'మానాన్న చిరంజీవి' 25న

ప్రైమ్ స్టార్ జగపతిబాబు హీరోగా జయశ్రీ సమర్పణలో లాఫింగ్ లార్డ్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై రూపొందిన చిత్రం 'మానాన్నచిరంజీవి' (అంటే పేద్ద హీరో). అరుణ్ ప్రసాద్ ('తమ్ముడు' ఫేమ్) దర్శకుడు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈనెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.హీరో జగపతిబాబు ఆ విశేషాలను తెలియజేస్తూ 'ఇందులో నా క్యారెక్టర్ పేరు చిరంజీవులు. నా కొడుక్కి పెద్ద హీరోని. బాగా స్ట్రగుల్ అయ్యే క్యారెక్టర్. ప్రతి మనిషికి స్ట్రగుల్స్ సహజం. అయితే ఎన్ని ఇబ్బందులున్న నవ్వుతూ ముందుకు సాగాలనే కాన్సెప్ట్ చాలా బాగుంటుంది. ఇదో మంచి ఫ్యామిలీ డ్రామా. ఎంటర్ టైన్ మెంట్, సెంటిమెంట్ సైతం అందర్నీ ఆకట్టుకుంటుంది. డైరెక్షన్ డిపార్ట్ మెంట్, ప్రొడక్షన్ అందరూ చాలా డెడికేషన్ తో పనిచేశారు. కొత్త నిర్మాత అయినా చాలా ప్లాన్డ్ గా సినిమా తీశారు. అరుణ్ ప్రసాద్ ఈ చిత్రంతో చాలా పెద్ద డైరెక్టర్ అవుతారు. ఆయన డైరెక్షన్ లో మళ్లీ నటించడానికి కూడా రెడీగా ఉన్నా. రెండు గంటల పాటు హ్యాపీగా ఈ చిత్రాన్ని ఎంజాయ్ చేయవచ్చు. అలాగే శుభలగ్నం చిత్రంలో ఆమని తరహా క్యారెక్టర్ ను నీలిమ చాలా బాగా చేసింది. మాష్టర్ అతులిత్ తో పుల్ లెంగ్త్ పాత్రను చాలా కాన్ఫిడెంట్ గా దర్శకుడు నాతో చేయించారు. అందరికీ మంచి పేరు వస్తుంది' అన్నారు. జగపతిబాబుతో పనిచేయడం చాలా ఆనందం కలిగించిందనీ, ఇందులో తన పాత్ర చాలా ఇష్టపడి చేశాననీ నీలిమ తెలిపింది. వెంకటేష్ తో నటించిన 'తులసి' పెద్ద హిట్ అయినప్పటికీ ఇప్పుడు జగపతిబాబుతో చేసిన 'మానాన్న చిరంజీవి' కూడా సూపర్ హిట్ అవుతుందని ఆశిస్తున్నట్టు మాస్టర్ అతులిత్ పేర్కొన్నాడు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో ఆలీ, ఎమ్మెస్ నారాయణ, జయప్రకాష్ రెడ్డి, తెలంగాణ శకుంతల, ఝాన్సీ, బెనర్జీ, సత్యం రాజేష్, మున్నా వేణు తదితరులు నటించారు. భరణి కె.ధరన్ సినిమాటోగ్రఫీ, రామ్-లక్ష్మణ్ ఫైట్స్, బస్వా పైడిరెడ్డి ఎడిటింగ్, హేమచంద్ర సంగీతం అందించారు

No comments:

Post a Comment