Saturday, November 14, 2009

'లీడర్' ట్రయిలర్ కు బ్రేక్!

డాక్టర్ డి.రామానాయుడు మనువడు, సురేష్ బాబు తనయుడు రానా హీరోగా పరిచయమవుతున్న 'లీడర్' చిత్రానికి పబ్లిసిటీ షురూ అయింది. రానాను అధికారికంగా మీడియాకూ, పబ్లిక్ కు పరిచయం చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. మరోవైపు ఇప్పటికే విడుదల చేసిన 'లీడర్' తొలి ట్రయిలర్స్ కు ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. 'షాడో ఇమేజ్'తో ఈ ట్రయిలర్ రిలీజైంది. తాజాగా ఈ చిత్రం రెండో ట్రయిలర్స్ ను సెన్సార్ తోసిపుచ్చిందని సమాచారం. పలువురు శాసనసభ్యుల గొంతులను ఇమిటేడ్ చేస్తూ ఈ ట్రయిలర్ ఉండటమే ఇందుకు కారణమని తెలుస్తోంది.'లీడర్' స్టోరీలైన్ గురించి శేఖర్ కమ్ముల ఇంతవరకూ పెదవి విప్పనప్పటికీ 'ది గాడ్ ఫాదర్ ' తరహాలో ఈ చిత్రం ఉండబోతోందనీ, స్వర్గీయ ఎన్టీఆర్ స్ఫూర్తితో అల్లుకున్న కథ ఇదనీ రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఇంతవరకూ ప్రేమకథా ఇతివృత్తాలతో వరుస హిట్లు సాధించిన శేఖర్ కమ్ముల రాజకీయ నేపథ్యంలో సినిమా తీస్తుంటడం ఇదే ప్రథమం. ప్రతిష్ఠాత్మక ఎవిఎం బ్యానర్ పై ఎం.శరవణన్, ఎం.ఎస్.గుహన్, అరుణ్ గుహన్, అపర్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రిచా గంగోపాధ్యాయ్, ప్రియా ఆనంద్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. మిక్కీ జె.మేయర్ సంగీతం అందించిన ఆడియో ఈనెల 22న, సినిమా డిసెంబర్ 24న విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

No comments:

Post a Comment