Saturday, November 14, 2009

తమన్నా నెంబర్ వన్?

మిల్క్ వైట్ బ్యూటీ తమన్నా'హ్యాపీడేస్' కంటిన్యూ కావడమే కాదు...తమిళ చిత్ర పరిశ్రమలో నెంబర్ వన్ ప్లేస్ కు ఆమె చేరువైంది. తమన్నా నటించిన 'కేడి' అప్పట్లో ఫ్లాప్ అయినా ఆ తర్వాత ఆమె నటించిన 'కల్లూరి' చిత్రం విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుని తమన్నాను బిజీ చేసింది. హిందీలో విజయవంతమైన 'జబ్ ఉయ్ మెట్' చిత్రానికి తమిళ రీమేక్ గా ఇటీవలే విడుదలైన 'కందేన్ కాదలై' ఘనవిజయం సాధిస్తుండంటతో తమన్నా డిమాండ్ మరింత పెరిగిపోయింది. ఈ చిత్రం చూసిన బాలీవుడ్ స్టార్ హీరో షారూక్ సైతం తమన్నా నటనను ప్రశంసించడంతో పాటు తన తదుపరి చిత్రంలో ఆమె పేరును ప్రపోజ్ చేశారట. ఆ మాటెలా ఉన్నా తమన్నా ప్రస్తుతం తమిళంలో నటిస్తున్న 3 సినిమాల్లో ఏ ఒక్కటి పెద్ద హిట్ అయినా తమన్నాకు నెంబర్ వన్ ప్లేస్ ఖాయమని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.
తమన్నా ప్రస్తుతం తెలుగులో సంచలన విజయం సాధించిన 'కిక్' చిత్రం రీమేక్ 'కిల్లాలంగడి'లో నటిస్తోంది. తెలుగు వెర్షన్ లో ఇలియానా తరహాలోనే సరికొత్త అందాలను తమన్నా ఇందులో ప్రదర్శించిందట. దీనికి తోడు కార్తి సరసన 'పయ్యా', విజయ్ తో 'సుర' చిత్రాల్లో ఆమె హీరోయిన్ గా నటిస్తోంది. ఈ రెండు చిత్రాలు ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్నాయి. వచ్చే ఏడాది ఆరంభంలోనే ఈ మూడు సినిమాలు రిలీజ్ అయి తమన్నా డిమాండ్ ను మరింత పెంచడం ఖాయమని అంటున్నారు. నయనతార ఈమధ్యన ప్రభుదేవాతో సహజీవనం సాగిస్తోందనే గట్టి ప్రచారం కారణంగా అగ్రహీరోల అభిమానులు కూడా 'నయనతార ఆంటీ'తో పనిచేయవద్దంటూ తమ అభిమాన హీరోలకు లేఖాస్త్రాలు సంధిస్తున్నారు. దీంతో నయనతారకు ఆఫర్లు తగ్గుముఖం పట్టాయట. నిన్నటి వరకూ బరిలో ఉన్న ఆసిన్, ఇప్పుడు త్రిష బాలీవుడ్ బాట పట్టేశారు. ఈ పరిణామాలు తనకు అనుకూలంగా మార్చుకుంటూ మంచి ప్రాజెక్ట్ లు దక్కించుకుంటున్న తమన్నా తన జీవితాశయం తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తో నటించడమేనంటూ ఓ స్టేట్ మెంట్ కూడా ఇచ్చేసింది. అదే జరిగితే తమన్నా కు నెంబర్ వన్ పొజిషన్ ఖాయం చేసుకోవచ్చు

No comments:

Post a Comment