
శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, ఈ చిత్రాన్ని చూసిన సెన్సార్ సభ్యులు అభినందించారనీ, సకుటుంబ సమేతంగా చూడదగిన చిత్రమిదని చెప్పారు. నిర్మాణంలో కొంత జాప్యం జరిగినప్పటికీ సినిమా చాలా సంతృప్తిగా వచ్చిందనీ, తన గత చిత్రాల కంటే మిన్నగా ఈ చిత్రం వినోదాత్మకంగా ఉండి ప్రేక్షకులను అలరిస్తుందని అన్నారు. ఎంటర్ టైన్ మెంట్, సెంటిమెంట్ వంటివన్నీ ఈ చిత్రంలో ఉంటూనే శ్రీకాంత్ నటన హైలైట్ గా ఉంటుందన్నారు. నవంబర్ 6న 140 ప్రింట్లతో 207 థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు నిర్మాత తెలిపారు. ఈ చిత్రం ఆడియోకి మంచి స్పందన వచ్చిందనీ, రీకార్డింగ్ విషయంలోనూ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని పనిచేశామని సంగీత దర్శకురాలు శ్రీలేఖ తెలిపారు. ఈ సమావేశంలో భాస్కరభట్ల రవికుమార్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత శేఖర్, నట్టికుమార్, కూనిరెడ్డి శ్రీనివాసరెడ్డి, బొళ్ల నాగేశ్వరరావు పాల్గొన్నారు. కౌష స్పెషల్ సాంగ్ లో నర్తించిన ఈ చిత్రంలో బ్రహ్మానందం, కృష్ణ భగవాన్, సునీల్, ఆలీ, ఎమ్మెస్ నారాయణ, ఏవీయస్, సూర్య, తనికెళ్ల భరణి, రఘబాబు, గిరిబాబు, తెలంగాణ శకుంతల, కోవై సరళ తదితరులు నటించారు.
No comments:
Post a Comment