
'హిందీ రీమేక్ కు ప్లాన్ చేస్తున్న విషయం నిజమే. నటీనటుల గురించి ఇప్పుడే చెప్పడం సబబు కాదు. ఒకటి మాత్రం నిజం. గజనీ కంటే కచ్చితంగా చాలా రిచ్ గా ఈ సినిమా తీయబోతున్నాం' అని మంతెన తెలిపారు. ఈ ఏడాది జూలైలో విడుదలైన రామ్ చరణ్ 'మగధీర' చిత్రం కేవలం ఇండియాలో 65 కోట్ల గ్రాస్ కలెక్షన్ రాబట్టి హిందీ టాప్ గ్రాసర్ అయిన 'గజనీ' తర్వాత రెండో ప్లేస్ లో నిలిచింది. 'మగధీర' చిత్రాన్ని 17వ శతాబ్దం నుంచి నేటి జనరేషన్ వరకూ నడిచే కథాంశంతో దర్శకుడు రాజమౌళి తెరకెక్కించారు. రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేశారు. ఆసక్తి కరంగా హిందీ వెర్షన్ లో 17వ శతాబ్దం నాటి ఫ్యాష్ బ్యాక్ ఎపిసోడ్ లో హృతిక్, నేటి తరం హీరోగా అమీర్ నటించబోతున్నారని సమాచారం. 70 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. వచ్చే ఏడాది ప్రథమార్థంలో షూటింగ్ ప్రారంభమవుతుందని తెలుస్తోంది. దర్శకుడుగా రాజమౌళి కొనసాగుతారా, వేరెవరికైనా ఈ ప్రాజెక్ట్ అప్పగిస్తారా అనేది తెలియ వలసి ఉంది
No comments:
Post a Comment