Friday, October 23, 2009

'యువరాజ్యం' ఆడియో

అరవింద్, కల్యాణ్ హీరోలుగా ఆస్రా నిర్మాణ్ ఇండియా సమర్పణలో వీరశంకర్ సిల్వర్ స్క్రీన్ పతాకంపై హెచ్.ఐ.హారూన్, బి.వి.శ్రీనివాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'యువరాజ్యం'. వీరశంకర్ దర్శకుడు. ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం శిల్పకలావేదికలో గురువారం రాత్రి జరిగింది. జె.డి.చక్రవర్తి ఆడియో సీడీని విడుదల చేసిన తొలి ప్రతిని సంగీత దర్శకుడు గురుకిరణ్ కు అందజేశారు. నాగేంద్రబాబు, సాగర్, తమ్మారెడ్డి భరద్వాజ, కృష్ణుడు, ఓ కల్యాణ్, సి.కల్యాణ్, కె.ఎస్.నాగేశ్వరరావు, త్రిపురనేని వరప్రసాద్, చంద్రమహేష్, ఆదిత్య రామ్, స్వర్ణ సుబ్బారావు, మాళవిక, రాజ్ కల్యాణ్, వెంకట్, బెంగుళూరు పద్మ, ఆంద్, సత్యదేవ్, యుత్ కాంగ్రెస్ నాయకుడు సుధీర్ బాబు, వీరశంకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వాంతంత్ర్య సమరయోధుడు నారాయణరావు పవార్ ను వేదికపై సన్మానించారు.

నాగబాబు మాట్లాడుతూ, సినిమా సంగీతం చాలా బాగుందనీ, ఆడియోతో పాటు సినిమా కూడా మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నాననీ అన్నారు. వీరశంకర్ ప్రతిభావంతుడైన దర్శకుడనీ, ఈ సినిమాకి పలువురు సంగీత దర్శకులు పనిచేయడం చెప్పుకోదగని విషయమని జె.డి.చక్రవర్తి పేర్కొన్నారు. వీరశంకర్ మాట్లాడుతూ, ఈ చిత్రానికి పనిచేసిన సంగీత దర్శకులందరికీ తన కృతజ్ఞతలని అన్నారు. యువతరంతో పాటు అందరూ చూడదగ్గ చిత్రమిదని తెలిపారు. అరవింద్, కల్యాణ్ హీరోలుగా పరిచయమవుతున్నారనీ, వెంకట్ నెగిటివ్ షేడ్ ఉన్న పాత్ర పోషించారనీ చెప్పారు. అలాగే ఈ చిత్రంలో నటించేందుకు అంగీకరించిన కృష్ణుడుకు ప్రత్యేక కృతజ్ఞతలని చెప్పారు. ఇందులో 60 శాతం కొత్తవాళ్లు నటించారనీ, అందరూ ఈ చిత్రాన్ని ఆదరిస్తారని ఆశిస్తున్నాననీ అన్నారు.


No comments:

Post a Comment