skip to main |
skip to sidebar
'అందమైన' నంది : ఆర్.పి.
ఉత్తమ కథా రచయితగా 'అందమైన మనసులో' చిత్రానికి గాను 2008 సంవత్సరానికి నంది అవార్డు తనను వరించడం పట్ల ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్'అందమైన' నంది : ఆర్.పి..పి.పట్నాయక్ సంతోషం వ్యక్తం చేశారు. తాము ఎంతో నిబద్ధతతో ఈ చిత్రానికి పనిచేసినందుకు అవార్డు రూపంలో తగిన గుర్తింపు వచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు. ఎస్.వి.ప్రొడక్షన్స్ పతాకంపై ఎస్.వి.బాబు నిర్మించిన ఈ చిత్రానికి ఆర్.పి.పట్నాయక్ తొలిసారి దర్శకత్వం వహించడంతో పాటు కథా రచన, స్క్రీన్ పే, సంగీతం అందించారు. చక్కటి ప్రేమకథా ఇతివృత్తంతో రూపొందిన ఈ చిత్రం దర్శకుడిగా ఆర్.పి. ఉత్తమాభిరుచిని చాటింది. అలాగే ఈ చిత్రంలోని 'అణుయుద్ధం...నో...నో..నో' అనే పాటను 'గిన్నెస్ బుక్ ఆఫ్ రికార్డ్స్'కు కూడా వెళ్లింది. ఆయనతో పాటు రాజ్, కోటి, ఎస్.ఎ.రాజ్ కుమార్, కీరవాణి, వందేమాతరం శ్రీనివాస్, శ్రీ, రమణ గోగుల, దేవీశ్రీప్రసాద్, చక్రి వంటి పది మంది సంగీత దర్శకులు ఈ పాటను పాటారు. ఒకే పాటను పదిమంది సంగీత దర్శకులు పాడటం బహుశా ప్రపంచ సినీ చరిత్రలోనే ఇది ప్రథమం. ప్రస్తుతం పెన్సిల్వేనియాలోని లాంకస్టెర్ లో ఓ హాలీవుడ్ చిత్రం (ఇంకా పేరు పెట్టలేదు) షూటింగ్ లో బిజీగా ఉన్న ఆర్.పి.పట్నాయక్ అక్కడ్నించే తన సంతోషాన్ని పంచుకున్నారు. హాలీవుడ్ చిత్రం షూటింగ్ లో ఉండగా 5.15 గంటలకు తన భార్య నంది అవార్డు వచ్చిన విషయం చెప్పి అభినందలు తెలియజేసిందనీ, ఎంతో కమిట్ మెంట్ తో తన టీమ్ మొత్తం ఈ సినిమాకు పనిచేసిందనీ, చిత్తశుద్ధితో తాము చేసిన ప్రయత్నానికి తప్పనిసరిగా నంది అవార్డు వస్తుందనే తన నమ్మకం ఈరోజు అవార్డు రూపంలో నిజమైందని అన్నారు. ఒక మంచి ప్రేమకథా ఇతివృత్తానికి చక్కటి సందేశం జోడించి ఈ చిత్రాన్ని రూపొందించామనీ, తమ ప్రయత్నాన్ని గుర్తించి అవార్డు ప్రకటించిన నంది అవార్డు కమిటీకి తన కృతజ్ఞతలనీ అన్నారు. ఈ అవార్డు క్రెడిట్ తన టీమ్ కూ, ముఖ్యంగా చిత్ర నిర్మాత ఎస్.వి.బాబుకు దక్కుతుందని ఆయన తన స్పందనను తెలియజేశారు.
No comments:
Post a Comment