Friday, October 23, 2009

జయీభవ' రివ్యూ

హీరోలను బట్టి కథలు అల్లుకుంటున్న ఈ రోజుల్లో కొత్తదనం ఎప్పుడో కానీ కనిపించని పరిస్థితి. అన్ని వర్గాల ఆడియెన్స్ పల్స్ పట్టుకోవడం, వారిని థియేటర్లకు రప్పించడం ఫిల్మ్ మేకర్స్ కు కత్తిమీద సామే అవుతోంది. దీంతో కొత్త దర్శకులు సైతం 'సేఫ్ గేమ్' ఆడటానికే ఇష్టపడుతున్నారు. రీల్ వన్ నుంచి యాక్షన్ అంటే జనాలకు మొహం మొత్తేయొచ్చు. అందుకే యాక్షన్ రెండు స్పూన్ లు, రొమాన్స్ మరో రెండు స్పూన్ లు వేసి ఈ రెండింటికీ సమపాళ్లలో కామెడీ కోటింగ్ ఇచ్చి వంటకం వడ్డించేస్తున్నారు. మొన్నటి 'కృష్ణ', నిన్నటి 'కిక్' ఈ ఫార్ములాతో వచ్చి విజయవంతమైనవే. 'అతనొక్కడే', 'హరేరామ్' వంటి సొంత బ్యానర్ చిత్రాలతో సక్సెస్ నూ, మాస్ ఇమేజ్ ను కూడా సొంతం చేసుకున్న కల్యాణ్ రామ్ ఇప్పుడు మళ్లీ సొంత బ్యానర్ లో నే 'జయీభవ' అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. గత రెండు చిత్రాలకు భిన్నంగా ఈసారి ఫ్యామిలీ సబ్జెక్ట్ తో ఎంటర్ టైన్ మెంట్ ప్రధానమైన కథను ఎంచుకున్నారు. తేజ, కృష్ణవంశీ వంటి దర్శకుల వద్ద పనిచేసిన నరేష్ కొండేపాటిని ఈ చిత్రంలో దర్శకుడిగా పరిచయం చేశారు. అయితే ఆయనపై తన దర్శక గురువుల కంటే త్రివిక్రమ్ శ్రీనివాస్, శ్రీను వైట్ల ప్రభావం కనిపిస్తుంది. బహుశా ఆయన ఎంచుకున్న కథాంశం ఇందుకు కారణం కావచ్చు. జయీభవ అంటే...జయం చేకూరాలని ఇచ్చే ఆశీర్వాదం. అన్నగారు నందమూరి తారకరామారావు 'దాన వీర శూర కర్ణ'లోని 'జయీభవ దిగ్విజయీభవ' అనే పాట పల్లవిని కూడా సందర్భోచితంగా సినిమాలోనూ, టైటిల్ లోనూ ఉపయోగించుకోవడంలో దర్శకుడు నేర్పు చూపారు. ఎటొచ్చీ...ఎంచుకున్న స్టోరీలైన్ అరిగిపోయిన రికార్డే. హీరోహీరోయిన్లు తొలిచూపులోనే ప్రేమించుకోవడం, ఆ తర్వాత ఆ ఇద్దరి తండ్రులు గతంలో మిత్రులుగా ఉండి ఇప్పుడు పగతో రగిలిపోతున్నారని తెలుసుకున్న ఆ జంట తమ పెళ్లితోనైనా ఆ ఇరు కుటుంబాలను కలిపాలని ప్రయత్నించి చివరకు కథను సుఖాంతం చేయడం చర్విత చర్వణమే కదా. నరేన్ కొండేపాటి తొలి ప్రయత్నం ఎలా సాగిందంటే...

No comments:

Post a Comment