Saturday, October 10, 2009

'ఆరంజ్' హిందీ రీమేకా?!

చిన్న హింట్ దొరికితే అసలు మూలకథ ఏమిటి, ఏ భాష నుంచి తీసుకుంటున్నారనే ఊహాగానాలు సహజం. 'మగధీర' వంటి సెన్సేషన్ హిట్ తర్వాత రామ్ చరణ్ ముచ్చటగా మూడో సినిమాకి సిద్ధమవుతున్నారు. 'బొమ్మరిల్లు', 'పరుగు' చిత్రాల తర్వాత భాస్కర్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. అంజనా ప్రొడక్షన్స్ పతాకంపై నాగబాబు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్, అత్యున్నత సాంకేతిక విలువలతో నిర్మించనున్నారు. ఈ చిత్రానికి 'ఆరంజ్' అనే టైటిల్ ప్రచారంలో ఉంది. తొలి రెండు చిత్రాలతో యాక్షన్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న రామ్ చరణ్ ఈ చిత్రంలో రొమాంటిక్ ప్లేబాయ్ గా కనిపించబోతున్నారట. దీంతో సహజంగానే ఇది హిందీ రీమేక్ కావచ్చంటూ ఊహాగానాలు జరుగుతున్నాయి.

తాజా సమచారం ప్రకారం...షాహిద్ కపూర్ కపూర్ కథానాయకుడుగా ఇటీవల హిందీలో విడుదలై విజయవంతమైన 'బచ్నా ఏ హసీనో' చిత్రానికి రీమేక్ గా ఈ చిత్రం ఉండబోతోందని సినీ వర్గాల అనధికార భోగట్టా. ఇదే కథను నేటివిటీకి అనుగుణంగా 'ఆరెంజ్' కోసం కొద్దిగా మార్పులు చేశారని అంటున్నారు. అయితే అధికారికంగా ఈ విషయాన్ని ఇంకా ఎవరూ ధ్రువీకరించలేదు. ఇందులో రామ్ చరణ్ కు జోడిగా జెనీలియా, సెకెండ్ హీరోయిన్ గా కృతి కర్బందా ('బోని' ఫేమ్) నటించనున్నారు. మూడో హీరోయిన్ గా ముంబై మోడల్ ఒకరిని అనుకుంటున్నారని తెలిసింది. అమెరికా, ఆస్ట్రేలియాలో కీలక షెడ్యూల్స్ ఉండబోతున్నాయి. ఈ నెల 21న లాంఛనంగా ఈ చిత్రం షూటింగ్ మొదలవుతుంది.

No comments:

Post a Comment