skip to main |
skip to sidebar
తమిళ హీరోలతో చరణ్ ఢీ!
హాలీవుడ్ స్థాయి సాంకేతిక ప్రమాణాలతో రూపొందిన 'మగధీర' చిత్రం పలు రికార్డులు సొంతం చేసుకుంటూ విజయవంతంగా 100 రోజులకు చేరువవుతోంది. ఇప్పటికే 62 కోట్లకు పైగా రికార్డు స్థాయి కలెక్షన్లు వసూలు చేసిన ఈ చిత్రం తమిళంలో విడుదలకు రంగం సిద్ధమవుతోంది. తమిళంలో డబ్బింగ్ చేస్తారా, రీమేక్ చేస్తారా అనే సస్పెన్స్ కు కూడా ఇప్పుడు తెరపడింది. అనువదించి విడుదల చేయడానికే గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ నిర్ణయించారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా తమిళనాట ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ఆయన సన్నాహాలు చేస్తున్నారు. తమిళనాట 'పొంగల్ ' రిలీజ్ ల పోటీ ఎక్కువగా ఉంటుంది. ఇందులో భాగంగానే స్టార్ హీరోలు విజయ్ నటించిన 'వేట్టైకారన్', అజిత్ నటించిన'అసల్' చిత్రాలు రిలీజ్ కానున్నాయి. ఈ రెండు చిత్రాలతో 'మగధీర'ను పోటీగా బరిలోకి దింపబోతున్నారు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సైతం ఇటీవల చెన్నైలో 'మగధీర' చిత్రం స్పెషల్ స్క్రీనింగ్ చూసి రామ్ చరణ్ నటనను, చిత్ర సాంకేతిక ప్రమాణాలను కొనియాడటం కూడా ఈ సినిమాపై తమిళ ఆడియెన్స్ లో మంచి అంచనాలు రేకెత్తిస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడి స్టార్ హీరోలకు 'మగధీర' గట్టి పోటీ ఇచ్చి విజేతగా నిలుస్తాడేమో చూడాలి...
No comments:
Post a Comment