
'నిజానికి ఇలాంటి వదంతులు పుట్టించే వారిని చూస్తే నవ్వొస్తుంది. నేను తీసిన చాలా సినిమాల్లో ఛార్మి నటించడంతో ఇద్దరి మధ్యా ఏదో ఉందనే ఊహాగానాలు వారు చేస్తుండొచ్చు. ఇది చాలా హాస్యాస్పదం. ఛార్మితో పాటు ప్రకాష్ రాజ్, లక్ష్మి, ఉత్తేజ్ వంటి వారు కూడా నేను తీసుకుంటూ ఉంటాను. అయితే అందర్నీ విడిచిపెట్టి వదంతులు పుట్టించే వాళ్లు ఛార్మినే ఈజీ టార్గెట్ చేసుకుంటున్నారు. ఇలాంటి వదంతులను నేను కానీ, రమ్యకృష్ణ కానీ పట్టించుకోవడం మానేసాం' అని కృష్ణవంశీ వివరణ ఇచ్చారు. రమ్యకృష్ణ ఇదే ఇండస్ట్రీ నుంచి వచ్చిన అమ్మాయి కావడంతో ఇలాంటి కష్టనష్టాలు ఆమెకు కూడా బాగా తెలుసుననీ, తనంటే ఎంతో ప్రేమ, పూర్తి నమ్మకం ఆమెకున్నాయనీ అన్నారు. ఒకరికోసం మరొకరు అన్నట్టుగా ఇద్దరూ చాలా హ్యాపీగా ఉన్నామని చెప్పారు. కృష్ణవంశీ వివరణతోనైనానా గాసిప్ మాంగర్స్ చల్లబడతారని అనుకుందాం.
No comments:
Post a Comment