Thursday, October 22, 2009

తండ్రి కానున్న ఇమ్రాన్

సీరియల్ కిస్సర్'గా అభిమానులు మురిపంగా పిలుచుకునే ఇమ్రాన్ హస్మి ఇప్పుడు తండ్రి కాబోతున్నారు. మూడేళ్ల క్రితం పర్వీన్ షహానీని ఇమ్రాన్ వివాహం చేసుకున్నారు. వీరి అన్యోన్య దాంపత్యంలోకి ఇప్పుడు మూడో వ్యక్తి రాబోతున్నారు. ప్రస్తుతం పర్వీన్ ప్రెగ్నెంట్ అనీ, ఐదున్నర నెలలు నిండాయనీ ఇమ్రాన్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ధ్రువీకరించారు. తమ కుటుంబంలోకి బుడిబుడి నడకల చిన్నారి వస్తుండటం పట్ల ఇమ్రాన్ దంపతులు ఎంతో సంబరంతో ఉన్నారనీ, పర్వీన్ కి వచ్చే ఏడాది జనవరిలో డెలివరీ కావచ్చనీ వారు తెలిపారు.

ఇమ్రాన్ ను సంప్రదించినప్పుడు 'జనవరిలో మా ఇంట్లోకి ఓ బేబి రాబోతోంది. తండ్రి కాబోతున్నాననే అనుభూతి చాలా కొత్తగా ఉంది. అమ్మాయి పుట్టినా అబ్బాయి అయినా మాకు ఇష్టమే. ఎవరైనా సంతోషంగా స్వాగతించాలని మేమిద్దరం నిర్ణయించుకున్నాం' అంటూ చెప్పుకొచ్చారు. పర్వీన్ గతంలో నర్సరీ టీచర్ గా పనిచేసింది. రెండేళ్ల క్రితమే ఆ జాబ్ కు స్వస్తి చెప్పి గృహిణిగా స్థిరపడింది.

No comments:

Post a Comment