Thursday, October 22, 2009

రెండు భాషల్లో 'ఓం శాంతి'

నారా రోహిత్ కథానాయకుడుగా వచ్చిన 'బాణం' చిత్రంతో మంచి అభిరుచిగల నిర్మాతగా పేరు తెచ్చుకున్న శేషు ప్రియాంక చలసాని (సి.అశ్వనీదత్ కుమార్తె) ద్వితీయ ప్రయత్నంగా 'ఓం శాంతి' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్రీ ఏంజెల్స్ స్టూడియో పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రం ద్వారా ప్రకాష్ అనే యువదర్శకుడు పరిచయమవుతున్నారు. తెలుగు, తమిళ భాషల్లో వైవిధ్యమైన కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. కాజల్ అగర్వాల్, నవదీప్, నిఖిల్, బిందుమాధవి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. హైద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ చిత్రం షూటింగ్ జరుపుకొంటోంది.

రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన ప్రత్యేకమైన సెట్ లో నవంబర్ 2 నుంచి కాజల్ పై ఓ సోల్ సాంగ్ చిత్రీకరణ జరుపనున్నారు. అనంతరం నవంబర్ 9 నుంచి నాలుగు రోజుల పాటు బెంగుళూరులో నిఖిల్ పై మరో పాత్ర చిత్రీకరిస్తారు. దీంతో దాదాపు షూటింగ్ పూర్తవుతుందని తెలుస్తోంది. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అయిన దర్శకుడు ప్రకాష్ న్యూయార్క్ ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ లో సైతం శిక్షణ పొందారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో మురళీ మోహన్, అదితీ శ్రమ, సునీల్, రఘబాబు, తనికెళ్ల భరణి, శివారెడ్డి తదితరులు పోషిస్తున్నారు. గంధం నాగరాజు రచన, జయనన్ విన్సెంట్ సినిమాటోగ్రఫీ, ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు.

No comments:

Post a Comment