skip to main |
skip to sidebar
"అదుర్స్" పేరు మార్పు.
వైస్హ్ణవి పిక్చర్స్ పతాకంపై, కొడాలి నాని సమర్పణలో,జూనియర్ యన్.టి.ఆర్.హీరోగా, నయనతార, షీలా హీరోయిన్లుగా, డైనమిక్ డైరెక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో ,వల్లభనేని వంశీ మోహన్ నిర్మిస్తున్న చిత్రానికి ఫిలిం నగర్ వర్గాల భోగట్టా ప్రకారం "అదుర్స్" అన్న పేరు ఇప్పటి వరకూ ప్రచారంలో ఉంది. కానీ ఈ చిత్రానికి ఆ పేరుని ఆ చిత్రం యూనిట్ ఇంకా ఖాయపరచలేదు.విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం ప్రకారం ఆ చిత్రానికి "లవకుశ" అనిగానీ లేదా "వాడే-వీడు" అని గానీ నామకరణం చేయాలని ఆ చిత్రం యూనిట్ ఆలోచిస్తున్నదని తెలిసిన వార్త.ఈ రెండు పేర్లూ కూడా స్వర్గీయ యన్.టి.ఆర్.హీరోగా నటించిన చిత్రాలే కావటం విశేషం.
No comments:
Post a Comment