Thursday, October 8, 2009

బాలయ్య...ఈవెంట్ షో

వరద బాధితులను ఆదుకునేందుకు సినీ పరిశ్రమకు చెందిన పలువురు పెద్ద ఎత్తున విరాళాలతో ముందుకు వస్తున్నారు. నందమూరి యువకిషోరం ఎన్టీఆర్ అందరి కన్నా ఎక్కువ విరాళంతో 'దాన వీర శూర కర్ణ' అనిపించుకున్నారు. సిఎం రిలీఫ్ ఫండ్ కు 20 లక్షలు, ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా మరో 20 లక్షలు విరాళం అందించారు. ఎన్టీఆర్ బాబాయి బాలకృష్ణ సైతం తన వంతుగా 20 లక్షల రూపాయల విరాళం ఎన్టీఆర్ ట్రస్టుకు అందజేశారు. ఇదే తరుణంలో సినీ తారలంతా కలిసి వరద బాధితుల సహాయార్థం ఓ ఈవెంట్ షో నిర్వహించాలని బాలకృష్ణ ప్రపోజ్ చేశారు.

బాలవకృష్ణ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ను సమావేశ పరచి ఈ విషయమై ముచ్చటించారనీ, నవంబర్ మొదటి వారంలో ఈ ఈవెంట్ నిర్వహించనున్నారనీ తెలుస్తోంది. మరోవైపు రామ్ చరణ్ 10 లక్షలు, రామానాయుడు 10 లక్షలు, అల్లు అర్జున్ 5 లక్షలు, నిర్మాత వెంకట్ 5 లక్షలు విరాళం ఇవ్వగా, పద్మశ్రీ బ్రహ్మానందం లక్ష రూపాయలు విలువచేసే వరద బాధిత సహాయ సామాగ్రిని వరద బాధిత ప్రాంతాలకు పంపారు. రాజశేఖర్-జీవిత దంతపులు వరద బాధిత ప్రాంతాల్లో ఆహార, సహాయక సామాగ్రి అందిస్తున్నారు. మెడిసన్స్, డాక్టర్ల బృందాన్ని కూడా ఆయా ప్రాంతాలకు పంపబోతున్నారు. వీటికి తోడుగా 'మగధీర' చిత్రం బెనిఫిట్ షో ద్వారా బాధితులను ఆదుకునేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. 'మహాత్మ' డిస్ట్రిబ్యూటర్లు సైతం టిక్కెట్లపై వచ్చిన ఆదాయం కొంత భాగం వరద బాధితులకు సహాయంగా అందించనున్నారు

No comments:

Post a Comment