Thursday, October 8, 2009

ఎక్కడన్నా రాజీపడతా కానీ అక్కడ కాదు

తన కంటు ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అందాల తార ప్రియమణి తెలుగు, తమిళ చిత్రాల్లో నటిస్తూ బిజీ గా ఉంటోంది. తెలుగులో విబిన్న మైన పాత్రలు పోషిస్తూ వస్తోంది. తనకుఉన్న డిమాండ్ పెరగడం తో ఈ ముద్దుగుమ్మ దానికి అనుగుణంగా తన రేటు కూడా పెంచుకుంటూ వస్తోంది. రెండు బాష ల్లో హిట్స్ సాధించిన ప్రియ మణి తన నటనతో పాటు మిగిలిన వాటిని గూడ పరిగణనలోకి తీసుకొని నా కున్న డిమాండ్, మార్కెట్ దృష్టిలో పెట్టుకొని నా రేటు నేను పెంచుకుంటే అందులో తప్పుపట్టాల్సిన అవసరం లేదని ప్రియమణి అంటోంది. ప్రియమణి వాదన లో కూడా నిజం లేక పోలేదు. సినిమా పరిశ్రమలో ఎవరి డిమాండ్ ఎంత కాలమో చెప్పడంకాష్టం. పైగా నిరంతరం కొత్త తార ల కోసం అన్వేషిస్తున్న ప్రస్తుత తరణంలో డిమాండ్, హావా ఉన్నపుడే రేటు పెంచు కొని నాలుగు డబ్బులు సంపాదించడమే నేటి తారల లక్ష్యం. ఎక్కడన్నా రాజీ పడతా కానీ రేటు విషయాలో మాత్రం కాదని ప్రియమణి తెగేసి చెబుతున్నా వైనం గమనిస్తే 'దీపం ఉండగానే ఇల్లు చక్కపెట్టుకోవడం' అన్న సామెత గుర్తుకు వస్తోంది. మీ రేమంటారు!

No comments:

Post a Comment