Monday, October 12, 2009

హిట్ సాంగ్ ల 'ఏక్ నిరంజన్'

'ఏక్ నిరంజన్' ఆడియో ఏకగ్రీవంగా సూపర్ హిట్ అనిపించుకుంటోందనీ, ఆడియో పెద్ద హిట్ కావడం సినిమాపై మరింత భారీ అంచనాలను పెంచిందనీ చిత్ర నిర్మాత ఆదిత్యరామ్ తెలిపారు. ప్రభాస్, కంగనా రనౌత్ జంటగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఆదిత్యారామ్ మూవీస్ పతాకంపై ఈ చిత్రం రూపొందింది.

ఆడియోకి వస్తున్న అనూహ్య స్పందనను ఆదిత్యరామ్ తెలియజేస్తూ, మణిశర్మ కంపోజ్ చేసిన ఆడియోలోని 6 పాటలు సూపర్ హిట్ కావడం ఆనందంగా ఉందని చెప్పారు. కొందరు 'ఏక్ నిరంజన్' టైటిల్ సాంగ్ ఎక్స్ టార్డినరీగా ఉందని చెబుతుంటే, మరికొందరు 'గుండెల్లో గిటారు మోగించావె' పాట సూపర్ అనీ, ఇంకొందరు 'మహమ్మారి మహమ్మారివే అందాల మహమ్మారివే' పాట ఎక్స్ లెంట్ అనీ, చాలామంది 'ఎవరూ లేరని అనుకు' సాంగ్ హృదయాల్ని టచ్ చేసిందనీ, 'సమీర సమీర' సాంగ్ బ్రహ్మాండంగా ఉందనీ, 'అరెరె నర్తనతార' అదిరిందనీ చెబుతుంటే ఆడియో పరంగా టార్గెట్ రీచ్ అయ్యామనే సంతృప్తి కలిగిందనీ అన్నారు. ఆడియోను ఇంత పెద్ద హిట్ చేసిన శ్రోతలందిరికీ తన కృతజ్ఞతలని అన్నారు. పాటలన్నీ విజువల్ గా కూడా చాలా గ్రాండ్ గా ఉంటాయని భరోసా ఇచ్చారు. ప్రభాస్ అత్యద్భుత నటన, దర్శకుడి బ్రిలియెన్సీ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణలని చెప్పారు. ఈనెల 29న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో సోనూసూద్, ముకుల్ దేవ్, మకరన్ దేశ్ పాండే, బ్రహ్మానందం, ఆలీ, సునీల్, వేణుమాధవ్, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి, సంగీత, పోసాని తదితరులు నటిస్తున్నారు. కథ-స్క్రీన్ ప్లే-మాటలు సైతం పూరీ జగన్నాథ్ అందిస్తున్న ఈ చిత్రానికి
శ్యామ్ కె నాయుడు సినిమాటోగ్రఫీ, ఎం.ఆర్.వర్మ ఎడిటింగ్, స్టన్ శివ ఫైట్స్ అందించారు.

No comments:

Post a Comment