Monday, October 26, 2009

మన్మథులు'గా కాదల్ కథై

తమిళ 'కాదల్ కథై' చిత్రాన్ని సూర్య డిజిటల్స్ సమర్పణలో నిర్మాత వి.సురేష్ చౌదరి తెలుగులోకి అనువదిస్తున్నారు. సూర్య పవర్ ఫుల్ మూవీస్ పతాకంపై దర్శకుడు వేలు రాజా తీర్చిదిద్దిన ఈ చిత్రానికి తెలుగులో 'మన్మథులు' అనే టైటిల్ ను ఖరారు చేశారు.

సురేష్ చౌదరి ఆ విశేషాలను తెలియజేస్తూ, ప్రేమకు సరికొత్త నిర్వచనాన్ని చెప్పే కథాంశంతో అంతా నూతన నటీనటులతో వేలు రాజా తమిళంలో తీసిన ఈ చిత్రం అన్ని కేంద్రాల్లో సరికొత్త రికార్డులను సృష్టిస్తోందని చెప్పారు. చిన్న సినిమాగా విడుదలై పెద్ద చిత్రమైందనీ, కామంతో కళ్లుమూసుకుపోయి కొందరు ప్రేమ పేరుతో ఆడవాళ్లను లోబరుచుకుని వాళ్ల మీద అత్యాచారాలు జరుపుతున్నారనీ, నేటి సమాజంలో జరుగుతున్న ఇలాంటి అకృత్యాలను దర్శకుడు ఈ చిత్రంలో కళ్లకు కట్టినట్టు చిత్రీకరించారనీ చెప్పారు. తెలుగులో కూడా ఈ చిత్రాన్ని ఆదరిస్తారనే నమ్మకంతో అనువదించామనీ, ప్రస్తుతం డబ్బింగ్ పూర్తయి ఫైనల్ ఎడిటింగ్ జరుగుతోందనీ చెప్పారు. అతిరూపన్, ప్రీతి రంగయాని జంటగా నటించిన ఈ చిత్రంలో బాబిలోనా, స్టెఫీ ఇతప పాత్రలను పోషించారు. ఈ చిత్రానికి పొందూరి గీతాలు, రాజశేఖర్ రెడ్డి సంభాషణలు, మధు ఎడిటింగ్ అందించారు.

No comments:

Post a Comment