Wednesday, October 21, 2009

బన్నీతో ఆమెకు ఎఫైరా?

గాసిప్ ల పేరు చెబితే బాలీవుడ్ కే పరిమితమనే రోజులు ఎప్పుడో పోయాయి. మీడియా మధ్య పెరుగుతున్న పోటీ వల్ల గాసిప్ మాంగర్స్ కు బాలీ...కోలీ...టాలీ..అనే తేడా లేకుండా చేతినిండా పని దొరుకుతోంది. టాలీవుడ్ లోకి సైలెంట్ గా అడుగుపెట్టిన లేఖ వాషింగ్టన్ సైతం ఇప్పుడు గాసిప్స్ లోకి చేరిపోయింది. చెన్నైలో పుట్టి పెరిగిన లేఖ ఎస్.ఎస్.మ్యూజిక్ లో విజెగా అందరికీ సుపరిచితురాలే. సోనీ టీవీలో అప్పట్లో ప్రసారమైన ఐ.పి.ఎల్. క్రికెట్ టోర్నమెంట్ కు యాంకర్ గా చేయడంతో ఒక్కసారిగా ఆమె అందిరి దృష్టిలో పడింది. 'ఫ్రేమ్డ్' అనే ఆంగ్ల చిత్రంలోనూ, 'ఉన్నలే ఉన్నలే', 'జయంకొండాన్' వంటి తమిళ చిత్రాల్లోనూ ఆమె నటించింది. తాజాగా తెలుగులోనూ తనదైన ముద్ర వేసుకునేందుకు పట్టుదలగా ఉంది. 'గమ్యం' చిత్రంతో దర్శకుడుగా తొలి హిట్ ను అందించిన క్రిష్ ఇప్పుడు మల్టీస్టారర్ 'వేదం' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో అల్లు అర్జున్, మంచు మనోజ్, అనుష్క ప్రధాన తారాగణం. ఇదే చిత్రానికి లేఖ కూడా సైన్ చేసింది. వచ్చే సంక్రాతింకి ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతుంది. ఆ సినిమా విశేషాలు ఇంకా పూర్తిగా బయటకు రానప్పటికీ లేఖ మాత్రం గాసిప్ సృష్టికర్తల జాబితాలో చేరిపోయింది. ఇటీవల జరిగిన ఓ అవార్డు ఫంక్షన్ లో అల్లు అర్జున్ అలియాస్ బన్నీ పక్కన ఆమె కనిపించడంతో ఆమెకు బన్నీతో ఎఫైర్ తగిలించేశారు.

'పక్క పక్క సీట్లలో కూర్చుంటే ఎఫైర్ ఉన్నట్టేనా? మా టీమ్ అందర్నీ ఒకచోట కూర్చోమని దర్శకుడు చెప్పడంతో అలా కూర్చున్నాం. అల్లు అర్జున్ మంచి మిత్రుడు మాత్రమే. అతను మాత్రమే కాదు. నా సహచర నటులంతా నాకు స్నేహితులే' అంటూ లేఖ దీనిపై వివరణ ఇచ్చింది. కెరీర్ ప్రారంభంలోనే మంచి టాలెంట్ ఉన్న ఆర్టిస్టులతో తెలుగులో నటించే అవకాశం రావడం తన అదృష్టమని కూడా చెప్పింది. ప్రస్తుతం బాలీవుడ్ లోనూ ఒకటి రెండు ఆఫర్లున్న లేఖ తెలుగులో క్లిక్ అయితే కొత్తతరం హీరోయిన్ లకు దడ పుట్టించే అవకాశాలున్నాయి.

No comments:

Post a Comment