
శానం నాగ అశోకకుమార్ మాట్లాడుతూ, ఇటీవలే ఈ చిత్రం టాకీ పార్ట్ పూర్తయిందనీ, డబ్బింగ్ కూడా జరుగుతోందనీ చెప్పారు. ప్రస్తుతం తీస్తున్న ఈ పాట మరో రెండు రోజుల్లో పూర్తవుతుందనీ, ఇంకో పాట బ్యాలెన్స్ ఉందనీ చెప్పారు. ఆ పాటను కూడా 27వ తేదీ నాటికి పూర్తి చేస్తామని అన్నారు. దీంతో షూటింగ్ మొత్తం పూర్తవుతుందని చెప్పారు. ఇదొక ఫ్యామిలీ లవ్ సబ్జెక్ట్ అనీ, ఫీల్ గుడ్ మూవీ అనీ తెలిపారు. హైద్రాబాద్ పరిసరాల్లోనూ, శ్రీశైలంలోనూ చిత్రీకరణ జరిపామన్నారు. విజయ్ బాలాజీని దర్శకుడిగా, షమన్ మిత్రును కెమెరామన్ గా పరిచయం చేస్తున్నామని తెలిపారు. తనీష్ పక్కింటబ్బాయి తరహా పాత్రను పోషిస్తుండగా, హీరోయిన్ చిలిపితనంగా ఉండే పాత్రను పోషిస్తోందని చెప్పారు. తమ బ్యానర్ నుంచి గతంలో వచ్చిన చిత్రాల మాదిరిగానే ఇది కూడా మంచి మ్యూజికల్ ఎంటర్ టైనర్ అవుతుందని అన్నారు. దర్శకుడు విజయ్ బాలాజీ మాట్లాడుతూ అందరూ చూడదగిన చిత్రమిదనీ, బ్యానర్ వాల్యూ పెంచే చిత్రంగా దీనిని తెరకెక్కిస్తున్నామనీ చెప్పారు. తాను నటించిన రెండు చిత్రాల కంటే కూడా ఇది ఒక డిఫరెంట్ మూవీ అవుతుందనీ, చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాననీ తనీష్ తెలిపారు. కాలేజీ గోయింగ్ గాళ్ గా చాలా క్యూట్ క్యారెక్టర్ ను పోషిస్తున్నానని మధురిమ తెలిపింది. కళాదర్శకుడు రాజు నాయర్ కూడా పాల్గొన్నారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో సుహాసిని, చంద్రమోహన్, ఎమ్మెస్ నారాయణ, ధర్మవరపు, ఏవీయస్, ఆలీ, ప్రసాద్ బాబు, రమాప్రభ, హేమ తదితరులు నటిస్తున్నారు. వనమాలి-భాస్కర భట్ల పాటలు, చింతపల్లి రమణ మాటలు, గౌతంరాజు ఎడిటింగ్ అందిస్తున్నారు.
No comments:
Post a Comment