Monday, October 12, 2009

'మానాన్న చిరంజీవి' ముస్తాబు

జగపతిబాబు కథానాయకుడుగా అరుణ్ ప్రసాద్ ('తమ్ముడు' ఫేమ్) దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'మానాన్న చిరంజీవి'. జయశ్రీ సమర్పణలో లాఫింగ్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై ఈ చిత్రం తెరకెక్కుతోంది. నవంబర్ మొదటి వారంలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

హీరో జగపతిబాబు ఆ విశేషాలను తెలియజేస్తూ, అరుణ్ ప్రసాద్ ఈ కథ ఎంత బాగా చెప్పారో అంతకంటే బాగా తెరకెక్కించారనీ, ఇటీవల కాలంలో తాను బాగా ఎంజాయ్ చేస్తూ చేసిన సినిమా ఇదనీ చెప్పారు. 'శుభలగ్నం'లా సెంటిమెంట్ ఉంటూ మంచి ఎంటర్ టైన్ మెంట్ ప్లస్ యాక్షన్ కలగలిసిన సబ్జెక్ట్ ఇదని అన్నారు. ఒక పిల్లవాడికి, తనకూ మధ్య ఉండే అనుబంధమే ఈ కథలోని కీలక పాయింట్ అని అన్నారు. మాస్టర్ అతులిత్ ఆ పిల్లాడి క్యారెక్టర్ చాలా బాగా చేశాడనీ, ఇద్దరూ కలిసి పాల్గొన్న ఓ పాట బ్యాంకాక్ లో చాలా లావిష్ గా తీశారనీ చెప్పారు. నిర్మాతలు ఎక్కడా రాజీ పడకుండా మంచి క్వాలిటీతో సినిమా తీశారని అన్నారు. అలాగే హీరోయిన్ గా నీలిమ మంచి ఫెర్ ఫారమెన్స్ చేసిందన్నారు. నవంబర్ మొదటి వారంలో విడుదలవుతున్న ఈ చిత్రం తన కెరీర్ లోనే మంచి పేరు తెస్తుందనే గట్టి నమ్మకం ఉందని అన్నారు. ఈ చిత్రంలో ఆలీ, ఎంఎస్ నారాయణ, జయప్రకాష్ రెడ్డి, తెలంగాణ శకుంతల, ఝన్సీ, బెనర్జీ, సంధ్య ఆచార్య, 'సత్యం' రాజేష్, 'చిత్రం' శ్రీను, 'మున్నా' వేణు, రాగిణి, కల్పన, తిరుపతి ప్రకాష్, రామ్ జగన్, అనంత్, శ్రీసురేష్, వెంకీ తదితరులు నటిస్తున్నారు. అరుణ్ ప్రసాద్ కథ-స్క్రీన్ ప్లే సైతం అందిస్తున్న ఈ చిత్రానికి భరణి కె ధరన్ ఫోటోగ్రఫీ, రామ్-లక్ష్మణ్ ఫైట్స్, బస్వా పైడిరెడ్డి ఎడిటింగ్, హేమచంద్ర సంగీతం అందిస్తున్నారు.

No comments:

Post a Comment