Wednesday, October 21, 2009

'మగధీర'కు పేరడీ

ఒక సినిమా ఘన విజయం సాధిస్తే అందులోని సన్నివేశాలతో కూడిన పేరడీలు కుప్పలుతెప్పలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తుంటాయి. 'చంద్రముఖి', 'అపరిచితుడు', 'శివాజీ' చిత్రాల్లోని సన్నివేశాలతో పేరడీలు చేసిన సినిమాలు నిన్నటి వరకూ చాలానే వచ్చాయి. 'బొమ్మాళీ నిన్ను వదలా' అంటూ 'అరుంధతి'కి పేరడీలు కూడా వచ్చేశాయి. ఇప్పుడు 'మగధీర' వంతు వచ్చింది. ప్రభాస్ కథానాయకుడుగా భారీ అంచనాల మధ్య విడుదలకు సిద్ధమవుతున్న 'ఏక్ నిరంజన్' కోసం దర్శకుడు పూరీ జగన్నాథ్ చొప్పించిన 'మగధీర' పేరడీ ఆ సినిమాకి ఓ హైలైట్ గా నిలుస్తుందని తెలుస్తోంది.

'మగధీర' దర్శకుడు రాజమౌళి వద్ద అనుమతి తీసుకుని ఈ పేరడీని పూరీ జగన్నాథ్ తన సినిమాలో చొప్పించారు. పూరీ జగన్నాథ్ సినిమాల్లో ఆలీ కామెడీ ట్రాక్ కు ఎప్పుడూ ఓ ప్రత్యేకత ఉంటుంది. 'పోకిరి', 'దేశముదురు' చిత్రాల్లో ఆలీ కామెడీ ట్రాక్ ను ప్రేక్షకులు మరిచిపోలేరు. 'చిరుత'లో 'నచిమీ' అంటూ ఆలీ వేసిన ఆడవేషం కూడా అలాంటిదే. తాజాగా 'ఏక్ నిరంజన్'లో 'మగధీర' పేరడీని కూడా ఆలీ చేతే చేయించారు. ఇందుకోసం ఆలీకి ప్రత్యేక కాస్ట్యూమ్స్ కూడా వాడారనీ, ప్రేక్షకులకు నవ్వుల వినోదం ఖాయమనీ చెబుతున్నారు. ప్రభాస్ కు జోడిగా కంగనా రనౌత్ నటించిన 'ఏక్ నిరంజన్' చిత్రాన్ని ఈనెల 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు చేసేందుకు నిర్మాత ఆదిత్యరామ్ సన్నాహాలు చేస్తున్నారు.

No comments:

Post a Comment