
మానవ జీవితం సుఖవంతం కావాలంటే ఇలాంటి భక్తిరస చిత్రాలు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని పుష్పగిరి స్వామి అన్నారు. 'ఆంధ్రప్రభ' సంపాదకులు పి.విజయబాబు మాట్లాడుతూ, ఈ చిత్ర నిర్మాణ సంస్థ మలయాళంలో పలు చిత్రాలు తీసిందనీ, ఈ చిత్ర దర్శకనిర్మాత లక్ష రూపాయల విరాళాన్ని వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయనిధికి ఇస్తున్నారనీ అన్నారు. కౌషిక్ బాబు మాట్లాడుతూ, ఈ చిత్రంలో నటిస్తుండటం తన అదృష్టమనీ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఈ చిత్రం రూపొందుతోందనీ అన్నారు. ఇందులో అయ్యప్ప స్వామిగా, యువరాజుగా, భక్తుడిగా మూడు కోణాల్లో తన పాత్ర ఉంటుందని అన్నారు. మహిషి సంహార తాండవ హైలైట్ గా ఉంటుందన్నారు. గురుక్రాంతి కిరణ్ దీనిని కంపోజ్ చేస్తున్నట్టు తెలిపారు. దర్శకుడు విజిష్ మణి మాట్లాడుతూ, 20 రోజులు హైద్రాబాద్ లో 20 రోజుల కేరళలో షూటింగ్ చేస్తామన్నారు. రామోజీ ఫిలింసిటీలో రెండు రోజులు, పోచంపల్లిలో 10 రోజులు షూటింగ్ జరుపుతామని చెప్పారు. ఇందులో భక్తుడిగా ఓ ముఖ్య పాత్రను పోషిస్తున్నట్టు సుమన్ తెలిపారు. ఇదో విభిన్నమైన చిత్రమనీ, కౌశిక్ కు ఇక్కడే కాకుండా కేరళలోనూ మంచి పేరుందనీ అన్నారు. మరో నటుడు సాయికిరణ్ మాట్లాడుతూ, ఇందులో భక్తుడి పాత్ర పోషిస్తున్నాననీ, కౌశిక్ బాబుతో కలిసి పనిచేస్తుండటం ఆనందంగా ఉందనీ అన్నారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో మాస్టర్ అతులిత్, మీరాజాస్మిన్, రాధాకుమారి, హేమసుందర్, జెన్నీ, అనిత తదిరులు నటించనున్నారు. ఈ చిత్రానికి మురళీకృష్ణన్ సినిమాటోగ్రఫీ, మను రమేష్ సంగీతం అందిస్తున్నారు.
No comments:
Post a Comment