Wednesday, October 21, 2009

కల్యాణ్ రామ్ VS సాయిరాం

యువ హీరోలు కల్యాణ్ రామ్, సాయిరాం శంకర్ ఈ వారంలో ముఖాముఖీ తలబడుతున్నారు. ఈ ఇద్దరు హీరోలకూ ఇప్పుడు ఓ హిట్ అనివార్యం. ఈ దశలో ఈ ఇద్దరూ సరైన సక్సెస్ కోసం ఒకేరోజు తలపడుతున్నారు. 'అతనొక్కడే', 'హరేరామ్' వంటి హిట్ చిత్రాలను ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై అందించిన కల్యాణ్ రామ్ ఇప్పుడు ఇదే సొంత బ్యానర్ పై హ్యాట్రిక్ కోసం సిద్ధపడుతున్నారు. ఆయన హీరోగా నటిస్తూ నిర్మించిన 'జయీభవ' చిత్రం ఈనెల 23న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇంతవరకూ ఫెయిల్యూర్స్ లేని హీరోయిన్ గా అనిపించుకున్న హన్సిక మోత్వాని ఈ చిత్రంలో కల్యాణ్ రామ్ కు జోడిగా నటించింది. నరేన్ కొండేపాటి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ధమన్ ఎస్ సంగీతం అందించిన ఆడియోకు మంచి స్పందన వస్తుండటం కూడా ఈ సినిమాపై అంచనాలను రేకెత్తిస్తోంది.

ఇక సాయిరాం శంకర్ కథానాయకుడుగా వైష్ణవి ఆర్ట్స్ పతాకంపై పూరీ జగన్నాథ్ నిర్మించిన చిత్రం 'బంపర్ ఆఫర్'. పూరీ జగన్నాథ్ శిష్యుడు జయ రవీంద్ర దర్శకుడిగా పరిచయమవుతున్నారు. సాయిరాంకు జోడిగా బిందు మాధవి నటించింది. వైష్ణో అకాడమీ బ్యానర్ పై గతంలో వచ్చిన 'ఇడియట్', 'అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి', 'పోకిరి' వంటి హిట్ చిత్రాల తరహాలోనే ఈ చిత్రం కూడా బంపర్ హిట్ అవుతుందని ఫిల్మ్ మేకర్స్ చెబుతున్నారు. అయితే ఇంతవరకూ హీరోగా సరైన సక్సెస్ లు లేని సాయిరాం కు ఈ చిత్రం హిట్ కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికే గాయకుడు రఘుకుంచెం తొలిసారిగా సంగీత దర్శకుడుగా మారి ఈ చిత్రానికి అందించిన ఆడియో మంచి టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రం అక్టోబర్ 2న విడుదల కావాలసి ఉన్నప్పటికీ కారణాంతరాల వల్ల 23న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. మరి...కల్యాణ్ రామ్ వెర్సస్ సాయిరాంలో ఏ 'రామ్' విజయకేతనం ఎగుర వేస్తారనేది ఈ వారాంతంలోనే తేలనుంది.


No comments:

Post a Comment