
'మగధీర' సాధించిన రికార్డుల పట్ల నిర్మాత అల్లు అరవింద్ స్పందిస్తూ 'సినిమా షూటింగ్ కు ముందు దర్శకుడు రాజమౌళితో ఒకే విషయం చెప్పాను. మా బ్యానర్ లో 29 సినిమాలు తీశాను. 14 సినిమాలు చిరంజీవితో చేశాను. అయితే ఎప్పుడూ ఏ దర్శకుడికీ చెప్పని మాట ఈరోజు మీతో చెబుతున్నాను. ఖర్చుకు ఆలోచించొద్దు. ఎన్ని రోజులైనా షూటింగ్ చేయండి. కానీ బెస్ట్ అవుట్ పుట్ మాత్రం ఇవ్వండి. నా మేనల్లుడు నెంబర్ వన్ హీరోగా నిలబడాలి. అన్ని రికార్డులు తిరగరాయాలి అని చెప్పాను. రాజమౌళి తూచ తప్పకుండా నా మాటలను చేత్లల్లో చూపించారు. భారతదేశ సినీ చరిత్రలోనే అరుదైన రికార్డులు ఇచ్చారు. 302 సెంటర్లలో 50 రోజులు, 223 డైరెక్ట్ సెంటర్లలో 100 రోజులు ప్రదర్శితమవుతుండటం చాలా హ్యాపీగా ఉంది' అన్నారు. జంట నగరాల్లో 'మగధీర' 100 రోజులు ప్రదర్శితమవుతున్న పలు థియేటర్లలో అభిమానులు శనివారంనాడు ఉత్సాహంతో పండుగ జరుపుకొంటున్నారు. రక్త దాన శిబిరాలు నిర్వహిస్తూ సంబరాలు జరుపుకొంటున్నారు. అమెరికాలోని న్యూజెర్సీ, బే ఏరియాలోని రెండు సెంటర్లలో కూడా ఈ చిత్రం డైరెక్ట్ సెంచరీ జరుపుకొని విజయోత్సవాలు జరుపుకొంటోంది. న్యూజెర్సీలోని బిగ్ సినిమాస్ లో శనివారం రాత్రి 10.15 గంటలకు 'స్పెషల్ ఫ్రీ షో ' కూడా నిర్వహిస్తున్నారు. కేక్ కట్ చేసి జరుపుకొనే ఈ సెంచరీ వేడుకలకు టీవీ-9 అమెరికా కవరేజ్ ఇవ్వనుంది
No comments:
Post a Comment