Friday, November 13, 2009

'బంపర్ ఆఫర్' డిస్క్ 15న

ఎంత కష్టపడినా అదృష్టం కూడా కలిసొస్తేనే సక్సెస్ చేతిలో పడుతుంది. సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న హీరో సాయిరాం శంకర్ కు 'బంపర్ ఆఫర్' రూపంలో ఆ కోరిక తీరింది. వైష్ణో అకాడమీ బ్యానర్ పై సాయిరాం శంకర్ సోదరుడు పూరీ జగన్నాథ్ నిర్మించిన ఈ చిత్రానికి పూరీ శిష్యుడు జయరవీంద్ర దర్శకత్వం వహించారు. మాస్ ఫార్ములాతో ఈ చిత్రం రూపొందడం, రఘు కుంచె తొలిసారి సంగీతం అందించిన పాటల్లో 'ఎందుకే రవణమ్మా...పెళ్లెందుకే రవణమ్మా' పాట ఆడియెన్స్ ను ఉర్రూతలూగించడం ఈ చిత్రాన్ని బాక్సాఫీస్ హిట్ వైపు నడిపించింది. ముఖ్యంగా బి,సి సెంటర్లలో ఈ చిత్రం తగిన వసూళ్లు రాబట్టడం, తక్కువ బడ్జెట్ చిత్రం కావడంతో ఇప్పటికే సైఫ్ సైడ్ లోకి వచ్చినట్టే. పూరీ జగన్నాథ్ సొంత ఆడియో సంస్థ పూరీ సంగీత్ ద్వారా విడుదలైన ఆడియోకు సినిమా రిలీజ్ తర్వాత మరింత డిమాండ్ పెరిగి మూడు లక్షలకు పైగా అమ్ముడుపోయాయి. దీంతో ఈ చిత్రం ట్రిపుల్ ప్లాటినం డిస్క్ వేడుకను ఈనెల 15న ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సుదర్శన్ 70 ఎంఎం థియేటర్ లో ప్రేక్షకుల నడుమ జరపబోతున్నారు
సాయంత్రం 6 గంటలకు జరిగే ఈ వేడుకలో పూరీ జగన్నాథ్, జయరవీంద్ర, సాయిరాం శంకర్, కథానాయిక బిందుమాధవి, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు పాల్గొంటారు.

No comments:

Post a Comment