
'ది గ్రడ్జ్' గురించి చిత్ర సమర్పకుడు టి.దుర్గారావు తెలియజేస్తూ, ఒక ఇంట్లో కొన్ని అనుకోని పరిస్థితుల్లో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంటుంది. ఆమె దెయ్యమై తిరుగుతోందనే ప్రచారంలో ఆ ఇంట్లోకి ఎవ్వరూ అద్దెకు రారు. ఆ విషయం తెలియని ఓ బృందం అదే ఇంటిని అద్దెకు తీసుకుంటారు. అక్కడి నుంచి వారికి కష్టాలు మొదలవుతాయి. ఒక్కొక్కరే హత్యకు గురవుతారు. ఆ బృందంలోని హీరోయిన్ ఈ మిస్టరీని ఎలా ఛేదించిందనేది ప్రధాన ఇతివృత్తం. దర్శకుడు సరా మైఖైల్ గిల్లార్ ఎంతో నైపుణ్యంగా ఈ చిత్రాన్ని తెరక్కించారనీ, అమెరికాలో ఈ చిత్రానికి డాలర్ల పంట పండిందనీ ఆయన తెలిపారు. ఈ చిత్రాన్ని తమ బ్యానర్ లో తెలుగు ప్రేక్షకులకు అందిస్తుండటం చాలా ఆనందంగా ఉందనీ, వెన్నెలకంటి చాలా అద్భుతమైన డైలాగ్స్ రాశారనీ, ప్రారంభం నుంచి ముగింపు వరకూ ఉత్కంఠతో సాగే ఈ చిత్రం తప్పకుండా తెలుగు ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం తనకుందని అన్నారు.
No comments:
Post a Comment