Wednesday, November 4, 2009

హైస్కూలు' పాటలు 8న

కిరణ్ రాథోడ్, మాస్టర్ కార్తీక్ ప్రధాన పాత్రధారులుగా రూపొందుతున్న యూత్ ఫుల్ మాస్ ఎంటర్ టైనర్ 'హైస్కూలు'. ఐశ్వర్య ఫిలింస్ పతాకంపై మలన్న నిర్మిస్తున్న చిత్రమిది. నరసింహ నంది దర్శకుడు. ప్రస్తుతం ఈ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. ఈనెల 8న ఈ చిత్రం ఆడియోను విడుదల చేయనున్నట్టు దర్శకనిర్మాతలు తెలిపారు.

నిర్మాత మల్లన్న మాట్లాడుతూ, చక్కటి ఫ్యామిలీ ఓరియెంటెడ్ సబ్జెక్ట్ ను రొమాంటిక్ గా కామెడీ, లవ్, సెంటిమెంట్ అంశాలు మేళవించి అన్ని తరహాల ప్రేక్షకులు మెచ్చే విధంగా ఈ చిత్రాన్ని దర్శకుడు మలిచారని చెప్పారు. సాకేత్ సాయిరాం సంగీతం అందించిన ఆరు పాటలూ యూత్ తో పాటు మాస్ ను కూడా అలరించే విధంగా ఉంటాయన్నారు. పాటలను మంచి లొకేషన్లలో చిత్రీకరించామనీ, 8న ఆడియో రిలీజ్ ఉంటుందనీ చెప్పారు. నరసింహ నంది మాట్లాడుతూ, చక్కటి రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఇదని చెప్పారు. సంగీత దర్శకుడు సాకేత్ సాయిరామ్ ఇచ్చిన బాణీలకు సాగర్, బాలభాస్కర్, రమణ చక్కటి సాహిత్యం అందించారనీ, పాటలను గోవా, ఊటీ, హైదరాబాద్ లలో ఖర్చుకు వెనకాబడకండా సెట్స్ వేసి రిచ్ గా చిత్రీకరించామని చెప్పారు. ప్రతీ పాట ప్రేక్షకులను అలరిస్తందని చెప్పారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో గుండు హనుమంతరావు, రజిత, తిలక్, జెన్ని, గౌతంరాజు, మల్లిక తదితరులు నటించారు. కథ-స్క్రీన్ ప్లే-మాటలు సైతం నరసింహ నంది అందించిన ఈ చిత్రానికి కల్యాణ్ సినిమాటోగ్రఫీ అందించారు.

No comments:

Post a Comment