Wednesday, November 4, 2009

'బిందాస్' పాటలు 9న

మంచు మనోజ్ కథానాయకుడుగా ఎ.కె.ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్న చిత్రం 'బిందాస్'. దీనికి 'అజయ్ గాడి విజయ గాధ' అనే ట్యాగ్ లైన్ ఉంది. ప్రముఖ రచయిత వీరుపోట్ల తొలిసారి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. షీనా హీరోయిన్ గా పరిచయమవుతోంది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం ఈనెల 9వ తేదీ సాయంత్రం 7.30 గంటలకు శిల్పకళారామంలో నిర్వహించనున్నారు. జీ తెలుగు ఛానెల్ ప్రత్యక్ష ప్రసారం చేయనున్న ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కె.రోశయ్య, డాక్టర్ దాసరి నారాయణరావు, రాఘవేంద్రరావు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, ఆది శేషగిరిరావు, ఎ.ఎం.రత్నం వంటి రాజకీయ, సినీ ప్రముఖులు పాల్గొంటారు.

బిందాస్ గా జీవితాన్ని సాగించే అజయ్ అనే యువకుడి కథే ఈ చిత్రమనీ, ఇందులో అజయ్ ఏ విషయాన్ని ఛాలెంజ్ గా తీసుకున్నాడు, దానిని ఎలా సాధించాడనేది ఆసక్తికరంగా ఉంటుందనీ నిర్మాత తెలిపారు. ఈనెల 9న ఆడియో విడుదల చేస్తున్నట్టు చెప్పారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రలో విజయ్ కుమార్, పరుచూరి వెంకటేశ్వరరావు, విశ్వనాథ్ కాశీ, ఆహుతి ప్రసాద్, సునీల్ తదితరులు నటిస్తున్నారు. బోబో శశి సంగీతం అందిస్తున్నారు.


No comments:

Post a Comment