Monday, November 2, 2009

గంగా-సాగర్' ప్రారంభం

విజయభాస్కర్, జి.మధు, రిచిత, రిషిక ప్రధాన పాత్రధారులుగా మురళీ మూవీ క్రియేషన్స్ పతాకంపై రూపొందుతున్న కొత్త చిత్రం 'గంగా-సాగర్'. చిత్తజల్లు ప్రసాద్ దర్శకుడు. ఈ చిత్రం ప్రారంభోత్సవం హైద్రాబాద్ లోని శ్రీ సారథి స్టూడియోస్ లో సోమవారం జరిగింది. ప్రధాన పాత్రధారులపై చిత్రీకరించిన ముహూర్తం సన్నివేశానికి నిర్మాత ఆర్.కె.గౌడ్ క్లాప్, ఎమ్మెల్యే ఎ.చంద్రశేఖర్ స్విచ్చాన్ చేశారు.

దర్శకుడు ప్రసాద్ మాట్లాడుతూ, మత్స్యకారుల జీవన చిత్రమిదనీ, సునామీ తదనంరం వారి గ్రామాల పునర్ణిర్మాణం, వారు ఏవిధంగా జాగృతమవుతున్నారనే అంశాలతో మంచి సందేశాత్మకంగా ఈ చిత్రం ఇంటుందనీ చెప్పారు. రెండ్రోజుల పాటు షూటింగ్ జరిపి, ఈనెల 11 నుంచి 25 రోజుల పాటు యానాంలో సింగిల్ షెడ్యూల్ జరుపుతామని నిర్మాతలు పి.రామ్మోహనరావు, కన్నా రవిదేవరాజ్ తెలిపారు. ఈ కథలో జీవం ఉందని నటుడు సుత్తివేలు, మానవత్వంతో కూడిన కథాంశమని నటులు కొండవలస పేర్కొన్నారు. ఇందులో మత్స్యకారుని పాత్రను పోషిస్తున్నట్టు విజయభాస్కర్ చెప్పారు. ఇన్ స్పెక్టర్ పాత్ర పోషిస్తున్న తాను మధు ఫిలిం ఇన్ స్టిట్యూట్ లో నటనకు సంబంధించిన శిక్షణ పొందినట్టు మరో నటుడు మధు తెలిపారు. ఇందులోని పాటలకు మంచి సాహిత్యం అందించనున్నట్టు ఆర్.డి.ఎస్.ప్రకాష్ తెలిపారు. ఈ చిత్రంలోని ఇతరపాత్రల్లో కోట శ్రీనివాసరావు, నర్రా, నటరాజ్, వినోద్, జీవా, రఘునాథరెడ్డి, చిట్టిబాబు, కవిత నటించనున్నారు. శ్రీనివాస్ కంకణాల సినిమాటోగ్రఫీ, అమోస్-వి.రామకృష్ణ సంగీతం అందించనున్నారు.

No comments:

Post a Comment