Tuesday, November 3, 2009

రంభకు బిఎండబ్ల్యు కారు

థండర్ సోయగాల రంభ ఇప్పుడు ప్రిస్టేజియస్ బిఎండబ్ల్యు కారు ఓనర్ కూడా అయింది. ఈమధ్యనే 'క్విక్ గన్ మురుగన్'తో రంభ ఇచ్చిన రీఎంట్రీ ఆమెకు మంచి రెప్యుటేషన్ కూడా తెచ్చింది. ఇప్పుడు రంభకు ప్రసిద్ధ 'మ్యాజిక్ వుడ్స్' సంస్థ ఖరీదైన బిఎండబ్ల్యు 7.5 సిరీస్ కు చెందిన కారును బహుతిగా అందజేసింది. ఆ కారు వెల అక్షరాలా కోటిన్నర రూపాయలు. ఇంతవరకూ ఈ కారు దక్షిణాదిలో రంభకు మినహా ఎవరికీ లేకపోవడం విశేషం.

కెనడాకు చెందిన 'మ్యాజిక్ వుడ్స్' కంపెనీ హోమ్, కిచెన్, వానిటీ హై లగ్జరీ ప్రోడక్టుల అమ్మకాలు జరుపుతుంటుంది. కంపెనీ నుంచి బిఎండబ్ల్యు 7.5 ఇండివుడ్యివల్ కారును 2010లో ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ లోకి తీసుకురానుంది. ఈ సంస్థకు ఇటీవలే బ్రాండ్ అంబాసిడర్ గా రంభ ఎంపకయ్యారు. ఆమెకు సంస్థ సరికొత్త మోడల్ కారును బహుమతిగా అందజేయడమే గాకుండా భారీ పారితోషికం కూడా ఆఫర్ చేశారు.

No comments:

Post a Comment