Wednesday, November 4, 2009

చిత్రోత్సవంలో 'సొంత ఊరు'

రాజా, తీర్ధ, ఎల్.బి.శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో పి.సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో బసరెడ్డి, వై.రవీంద్రబాబు సంయుక్తంగా నిర్మించిన 'సొంత ఊరు' చిత్రం ముంబై అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ప్రదర్శితపై ప్రముఖుల ప్రశంసలు అందుకుంది. ప్రధాన పాత్రధారుల నటన, బిగువైన స్క్రీన్ ప్లే చిత్రోత్సవానికి హాజరైన ఆడియెన్స్ ను విశేషంగా ఆకట్టుకుంది. ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన ఈ చిత్రం కమర్షియల్ సక్సెస్ ను సాధించనప్పటికీ ముంబై ఫెస్టివల్ లో ప్రశంసలు అందుకోవడం ఆ చిత్ర యూనిట్ ను సంబరంలో ముంచెత్తింది.

సునీల్ కుమార్ రెడ్డి ఆ విశేషాలను తెలియజేస్తూ, అక్టోబర్ 29న ప్రారంభమైన ప్రతిష్టాత్మక ముంబై అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో 56 దేశాల నుంచి 200 చిత్రాలు ఎంపికయ్యాయనీ, అందులో తెలుగు నుంచి ఎంపికైన ఏకైక చిత్రం 'సొంత ఊరు' అనీ చెప్పారు. శ్యామ్ బెనగల్ చైర్మన్ గా వ్యవహరించిన ఈ పెస్టివల్ లో ప్రదర్శించిన తమ చిత్రానికి అరుదైన ప్రశంసలు వచ్చాయనీ, తమిళ డైరెక్టర్ చేరన్ ('ఆటోగ్రాఫ్' ఫేమ్) తమ సినిమా చూసి ఎల్బీ శ్రీరామ్, తీర్ధ, రాజాల నటనను ప్రశంసించారానీ, థాయ్ లాండ్ ఫిల్మ్ కో-ఆర్డినేటర్ లేఖా శంకర్, పలు చలనచిత్రోత్సావాలకు కోఆర్డినేటర్ గా వ్యవహరించిన ఉమ డా కున, గ్రీస్ నిర్మాత జేమ్స్ మింకోస్ తదితరులు తమ ఇంటర్వ్యూలలో ఈ చిత్రాన్ని ప్రశంసించారనీ తెలిపారు. ఈ సినిమాను ఆడియెన్స్ కు పి.సునీల్ కుమార్ రెడ్డి పరిచయం చేయగా, సినిమా మేకింగ్, టెక్నాలజీ వంటి అంశాలను డిజిక్వెస్ట్ ఇండియా సిఇవో కె.బసిరెడ్డి వివరించారు. ఈ సినిమా తరఫున తీర్థ, ఛాయాగ్రాహకుడు సాబు జేమ్స్, నిర్మాత రవీంద్రబాబు కూడా హాజరయ్యారు.

No comments:

Post a Comment