Thursday, November 5, 2009

వావ్' సాయికుమార్

బాలనటుడిగా కెరీర్ ప్రారంభించి విలన్ గా, హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించిన నటుడు సాయికుమార్. వందలాది చిత్రాలకు, ఎందరో పేరున్న హీరోలకు డబ్బింగ్ చెప్పి 'డైలాగ్ కింగ్' అనిపించుకున్నారు. కన్నడంలో స్టార్ హీరో గా కూడా రాణిస్తున్నారు. తాజాగా ఆయన బుల్లితెర యాంకర్ గా మరో కొత్త అవతారంలో కనిపించబోతున్నారు. ప్రముఖ తెలుగు ఛానెల్ ఈటీవీ కోసం 'వావ్' అనే గేమ్ షో యాంకర్ గా తన కంచుకంఠంతో అలరించనున్నారు. 'మాంచి కిక్ ఇచ్చే గేమ్ షో' ఇదనీ, ఇదొక సంచలన ప్రోగ్రాం అవుతుందనీ సాయికుమార్ గురువారంనాడు తెలిపారు.

ఇంతవరకూ వచ్చిన గేమ్ షోలలలోనే ఇది విభిన్నమైనదని, ఇందులో నలుగురు పార్టిసిపెంట్స్ ఉంటారనీ, 5 లక్షల నగదు బహుమతి ఉంటుందనీ ఆయన తెలిపారు. వెండితెరపైనే కాకుండా గతంలో బుల్లితెరపై కూడా తాను కొన్ని ప్రోగ్రామ్స్ ఇచ్చాననీ, ఈటీవీ కోసం తాను చేస్తున్న 'వావ్' గేమ్ షో మరో సంచలనమవుతుందనీ చెప్పారు. ఈ టీవీలో 6వ తేదీ శుక్రవారం నుంచే ఈ గేమ్ షే ప్రారంభమవుతుంది. వారం వారం శుక్ర, శనివారాల్లో రాత్రి 9.30 గంటలకు ఈ గేమ్ షో ప్రసారమవుతుంది.

No comments:

Post a Comment