Tuesday, November 10, 2009

రామ్ తో మళ్లీ ఇలియానా

వై.వి.ఎస్.చౌదరి దర్శకత్వంలో మూడేళ్ల క్రితం వచ్చిన 'దేవదాసు' చిత్రం అటు హీరో రామ్ కూ, హీరోయిన్ ఇలియానాకూ గోల్డెన్ ఎంట్రీ అయింది. ఇద్దరికీ ఆ చిత్రం సిల్వర్ జూబ్లీ హిట్ ఇచ్చింది. రామ్ కు యూత్ లో మంచి ఫాలోయింగ్ రాగా, ఇలియానా ఆ వెంటనే వచ్చిన 'పోకిరి'తో టాప్ హీరోయిన్ల జాబితాలోకి వెళ్లిపోయింది. మళ్లీ ఇదే కాంబినేషన్ లో వై.వి.ఎస్. ఓ చిత్రానికి ఆమధ్య ప్లాన్ చేసినప్పటికీ కారణాంతరాల వల్ల రామ్ వేరే ప్రాజెక్ట్ ల వైపు మళ్లారు. ఇలియానా మాత్రం వై.వి.ఎస్. మీద ఉన్న అభిమానంతో 'సలీం' చిత్రంలో నటిస్తోంది. ఎట్టకేలకు రామ్-ఇలియానా రెండోసారి కలిసి పనిచేసేందుకు రంగం సిద్ధమైంది. 'కిక్' చిత్రంతో ఈ ఏడాది సరైన హిట్ కొట్టిన దర్శకుడు సురేందర్ రెడ్డి ఈ కొత్త చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు
సురేందర్ రెడ్డి తీసిన 'కిక్'లో ఇలియానాను కొత్త గ్లామర్ సొబగులతో సురేందర్ రెడ్డి ప్రెజెంట్ చేశారు. దీనికితోడు తన తొలి చిత్ర హీరోతో మళ్లీ నటించే అవకాశం కూడా రావడంతో వెంటనే ఇలియానా ఈ కొత్త ఆఫర్ ను ఒప్పుకుందని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని స్రవంతి రవికిషోర్ నిర్మించనున్నారనీ, వచ్చే ఏడాది ఫ్రిబవరిలో ఈ చిత్రం సెట్స్ పైకి వస్తుందని తెలుస్తోంది. రామ్ ప్రస్తుతం దిల్ రాజు నిర్మిస్తున్న 'రామరామ కృష్ణకృష్ణ' చిత్రంలోనూ, ఇలియానా 'సలీం' చిత్రంలోనూ నటిస్తున్నారు

No comments:

Post a Comment