
దాసరి మాట్లాడుతూ, మోహన్ బాబు ఇదే బేనరుపై హీరోగా నటించి తీసిన తొలి చిత్రం 'ప్రతిజ్ఞ' 100 రోజులు ఆడిందనీ, అప్పటి నుంచి ఇంతవరకూ 53 సినిమాలు ఈ బ్యానర్ పై తీశారనీ చెప్పారు. మోహన్ బాబు తప్పితే ఏ హీరో కూడా నిర్మాతగా 53 సినిమాలు తీయలేరనీ, ఆ క్రెడిట్ అతనికే దక్కుతుందనీ అన్నారు. మోహన్ బాబు, వై.వి.ఎస్.చౌదరిలది అరుదైన కాంబినేషన్ అనీ, ఇద్దరూ రాజీపడని వ్యక్తులు కావడంతో కథ డిమాండ్ మేరకు భారీ బడ్జెట్ అయిందనీ అన్నారు. ఈ చిత్రం తప్పకుండా పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకం తనకుందని చెప్పారు. 23 కోట్ల బడ్జెట్ తో సినిమా తీసినట్టు మోహన్ బాబు తెలిపారు. రిలయన్స్ బిగ్ పిక్చర్స్ వారు ఈ చిత్ర నిర్మాణంలో పాలుపంచుకోవడం ఆనందంగా ఉందన్నారు. వై.వి.ఎస్.చౌదరి మాట్లాడుతూ, విష్ణు, ఇలియానా తమ పాత్రలకు ప్రాణం పోయగా, మోహన్ బాబు ఓ అద్భుతమైన పాత్ర పోషించారని చెప్పారు. సందీప్ చౌతా సంగీతం అందర్నీ అలరిస్తుందన్నారు. ఈ చిత్రాన్ని దర్శకుడు చాలా బాగా మలిచారనీ, రాంప్రసాద్ ఫోటోగ్రఫీ, సందీప్ చౌతా సంగీతం హైలైట్స్ గా నిలుస్తాయనీ, సమష్టి కృషితో చేసిన చిత్రమిదనీ హీరో విష్ణు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవినేని నెహ్రూ, మండలి బుద్ధ ప్రసాద్, యాదగిరిరెడ్డి, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్. బిగ్ పిక్చర్ సంజీవ్ లంబా, శాంతా బయోటెక్ అధినేత డాక్టర్ వరప్రసాద్ రెడ్డి, ప్రసాద్ సంస్థల అధినేత రమేష్ ప్రసాద్, దర్శకులు వి.వి.వినాయక్, రాజమౌళి, హీరోలు కల్యాణ్ రామ్, నితిన్, మనోజ్ కుమార్, వెంకట్, హీరోయిన్లు ఇలియానా, కావేరి ఝా, మమతా మోహన్ దాస్, చిత్ర సమర్పకురాలు లక్ష్మీప్రసన్న, నిర్మలా మోహన్ బాబు, చంద్రబోస్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment