'శ్రీ సీతారామ జననం' నుంచి 'శ్రీరామదాసు' వరకూ ఆరున్నర దశాబ్దాల నట జీవితాన్ని సాగించిన మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు. పద్మశ్రీ, పద్మభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే, ఎన్టీఆర్ జాతీయ అవార్డు వంటివెన్నో ఆయన కీర్తికిరీటంలో నిలుస్తాయి. 85 ఏళ్ల అక్కినేని నట జీవితం చూస్తే తెలుగు సినిమా చరిత్రను ఒకసారి తిరగరాసినట్టే అనిపిస్తుంది. అలాంటి సుదీర్ఘ సినీ చరిత్ర ఆయన సొంతం. ఆయన నట జీవిత విశేషాలపై సుమ యాంకర్ గా మా టీవీలో 'గుర్తుకొస్తున్నాయి..'అనే ధారావాహిక ప్రసారమైంది. అక్కినేని అనుభవాలతో కూడిన ఆ సమాహారాన్ని మోసర్ బేర్ సంస్థ వీడియో రూపంలో తీసుకువస్తోందిమహానటుడు అక్కినేని అనుభవాలు రంగరించిన 'గుర్తుకొస్తున్నాయి...' ధారావాహికను 25 వాల్యూమ్స్ గా వీడియో సీడీల రూపంలో విడుదల చేయనున్నట్టు మోజర్ బేర్ సంస్థ ప్రతినిధి శివప్రసాద్ తెలిపారు. ఈనెల 12న అన్నపూర్ణా స్టూడియోస్ లో వీటిని విడుదల చేస్తామనీ, అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, వారి కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ ఆవిష్కరణ జరుగుతుందనీ ఆయన తెలిపారు
No comments:
Post a Comment