Wednesday, November 11, 2009

'అమరావతి' డిసెంబర్ లో

భూమిక, స్నేహ హీరోయిన్లుగా, నందమూరి తారకరత్న ఓ ప్రధాన పాత్రలో నటిస్తున్న థ్రిల్లర్ చిత్రం 'అమరావతి'. 'అనసూయ', 'నచ్చావులే' చిత్రాల తర్వాత నటుడు-దర్శకుడు అల్లరి రవిబాబు దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై వి.ఆనంద ప్రసాద్ ('శౌర్యం' ఫేమ్) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్న ఈ చిత్రం డిసెంబర్ లో విడుదలకు సిద్ధమవుతోంది
తొలిసారి చిత్ర విశేషాలను దర్శకుడు రవిబాబు తెలియజేస్తూ, ఇదొక థ్రిల్లర్ అనీ, కథ-కథనాలు ఆసక్తికరంగా ఉంటాయనీ చెప్పారు. చిత్రీకరణ కూడా చాలా వైవిధ్యంగా ఉంటుందనీ, 'అనసూయ', 'నచ్చావులే' చిత్రాలకు పూర్తి భిన్నంగా ఈ చిత్రం ఉంటుందనీ అన్నారు. ఇందులో తాను కూడా ఓ కీలక పాత్ర పోషించినట్టు తెలిపారు. పాటలనేవే సినిమాలో ఉండవనీ, అయితే రీరికార్డింగ్ వెన్నుదన్నుగా నిలుస్తుందని అన్నారు. నిర్మాత ఆనంద ప్రసాద్ మాట్లాడుతూ, ఆధునిక సినిమాకి సరికొత్త నిర్వచనం చెప్పగల దర్శకుడు రవిబాబు అనీ, ఈ చిత్రం హాలీవుడ్ సినిమా చూసిన అనుభూతిని కలిగిస్తుందనీ చెప్పారు. ఇప్పటికే థియేటర్ ట్రైలర్స్ కు మంచి స్పందన వస్తోందన్నారు. ప్రస్తుతం రీరికార్డింగ్ జరుగుతోందనీ, అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి డిసెంబర్ మొదటివారంలో సినిమా విడుదల చేస్తాని చెప్పారు. ఈ చిత్రంలో గద్దె సింధూర, కోట శ్రీనివాసరావు, పరుచూరి గోపాలకృష్ణ, విశ్వనాథ్ కాశీ, రాఘువ, మధు తదితరులు నటించారు. సుధాకర్ రెడ్డి సినిమాటోగ్రఫీ, నారాయణ రెడ్డి ఆర్ట్, శంకర్ ఎడిటింగ్, శేఖర్ చంద్ర సంగీతం అందించారు

No comments:

Post a Comment