
దర్శకుడు నగేష్ నారదాసి ఆ విశేషాలను తెలియజేస్తూ, అక్టోబర్ 19న తలకోనలో ప్రారంభించిన తొలి షెడ్యూల్ ఈనెల 4వ తేదీతో పూర్తయిందనీ, ఇందులో భాగంగా కొంత టాకీతో పాటు, కొరియోగ్రాఫర్ ప్రదీప్ ఆంటోని సారథ్యంలో గద్దె సింధూరపై ఓ పాట చిత్రీకరించామనీ చెప్పారు. రెండో షెడ్యూల్ ఈనెల 25 నుంచి ప్రారంభించి మొత్తం టాకీ పూర్తి చేయనున్నట్టు చెప్పారు. 30 ఏళ్ల క్రితం జరిగిన ఓ యదార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు తెలిపారు. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో జరిగే పూర్తి స్థాయి సస్పెన్స్ థ్రిల్లర్ ఇదని చెప్పారు. ఫిబ్రవరిలో రిలీజ్ ఉంటుందన్నారు. కథ-కథనం ఈ చిత్రానికి ప్రధాన బలమనీ, గద్దె సింధూర అద్భుతమైన పాత్ర పోషిస్తోందని నిర్మాత కిరణ్ తెలిపారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో జీవా, తనికెళ్ల భరణి, రవిప్రకాష్, పొన్నాంబలం, రామిరెడ్డి, సుమన్ శెట్టి, నిళల్ గళ్ రవి తదితరులు నటిస్తున్నారు. కథ-మాటలు-స్క్రీన్ ప్లే సైతం నగేష్ నారదాసి అందిస్తున్న ఈ చిత్రానికి మధు ఎ.నాయుడు సినిమాటోగ్రఫీ, నందు ఫైట్స్, నందమూరి హరి ఎడిటింగ్, సాయికార్తీక్ సంగీతం అందిస్తున్నారు.
No comments:
Post a Comment