Friday, November 13, 2009

శేఖర్ సూరితో దాసరి అరుణ్

దర్శకరత్న దాసరి నారాయణరావు తనయుడు దాసరి అరుణ్ ఏడాది గ్యాప్ తర్వాత మళ్లీ ముఖానికి మేకప్ వేసుకోబోతున్నారు. ఇంతవరకూ అరడజనకు పైగా సినిమాలు చేసినప్పటికీ అరుణ్ కు హీరోగా సరైన బ్రేక్ చిక్కలేదు. 'గ్రీకువీరుడు' (1998)లో పరిశ్రమకు హీరోగా పరిచయమైన ఆయన ఆ తర్వాత 'ఒరేయ్ తమ్ముడు', 'చిన్నా', 'కొండవీటి సింహాసనం', 'సామాన్యుడు' (హీరో మిత్రుడి పాత్ర) వంటి చిత్రాల్లో నటించారు. గత ఏడాది సోలో హీరోగా 'ఆదివిష్ణు' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ చిత్రం సైతం బాక్సాఫీస్ ను ఆకట్టుకోకపోవడంతో అరుణ్ కొద్ది గ్యాప్ తీసుకుని ఇప్పుడు శేఖర్ సూరి దర్శకత్వంలో ఓ కొత్త చిత్రానికి కమిట్ అయ్యారు
'అదృష్టం', 'ఎ ఫిలిం బై అరవింద్', 'త్రీ' చిత్రాల తర్వాత శేఖర్ సూరి దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం అంజలీ స్క్రీన్స్ పతాకంపై రూపొందనుంది. ఇది జనరంజకమైన కథ అనీ, తన బాడీలాంగ్వేజ్ కు తగ్గట్టుగా ఇందులో తన పాత్ర ఉంటుందనీ, ఇదొక సంచలనాత్మక చిత్రం అవుతుందనీ దాసరి అరుణ్ చెప్పారు. పరిశ్రమలోని పలువురు పేరున్న నటులు, సాంకేతిక నిపుణులు ఈ చిత్రాన్ని పనిచేయబోతున్నారు. త్వరలోనే ఈ చిత్రం ప్రారంభం కానుంది.

No comments:

Post a Comment