Monday, November 2, 2009

పవన్-గణేష్ బాబు చిత్రం

పవన్ కల్యాణ్ కథానాయకుడుగా హరీష్ శంకర్ దర్శకత్వంలో పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై నటుడు గణేష్ బాబు నిర్మించనున్న చిత్రం ప్రొడక్షన్స్ నెంబర్-3 చిత్రం షూటింగ్ ముహూర్తం డిసెంబర్ లో జరుగుతుంది. ఈ చిత్రానికి బడే రవి సమర్పకుడు.

ఈ చిత్రం గురించి గణేష్ బాబు తెలియజేస్తూ, ఇది ఒక రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ అనీ, పక్కాగా స్క్రిప్టు రెడీ అయిందనీ చెప్పారు. అద్భుతమైన కథ-కథనాలతో భారీ ఎత్తున ఈ చిత్రాన్ని నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు చెప్పారు. ఇందులో ఇద్దరు ప్రముఖ హీరోయిన్లు నటిస్తారనీ, పవన్ తో సూపర్ డూపర్ హిట్ చిత్రానికి పనిచేసిన యువ సంగీత దర్శకుడు ఈచిత్రానికి పనిచేస్తాడనీ చెప్పారు. అలాగే బాలీవుడ్ లో ఇటీవల సంచనల విజయం సాధించిన ఓ చిత్రానికి పనిచేసిన సాంకేతిక నిపుణులు, ఓ ప్రముఖ ఫైట్ మాస్టర్ ఈ చిత్రానికి పనిచేస్తారని తెలిపారు. పవర్ స్టార్ పవన్ కెరీర్ లో సంచలనాత్మక చిత్రంగా ఇది ఉంటుందన్నారు. డిసెంబర్ లో ముహూర్తం జరిపి, జనవరి, ఫ్రిబవరి నెలల్లో షెడ్యూల్ ప్రారంభిస్తామనీ, ఏకథాటిగా షూటింగ్ ఉంటుందనీ చిత్ర సమర్పకుడు బడే రవి తెలిపారు. పవన్ 'పులి' చిత్రం పూర్తికాగానే ఈ చిత్రం మొదలవుతుందని చెప్పారు.

No comments:

Post a Comment