skip to main |
skip to sidebar
మలయాళంలో కార్తీక
తొలిచిత్రం హిట్, ఫ్లాప్ ల సెంటిమెంట్ పరిశ్రమంలో బాగా పనిచేస్తుంటుంది. నాగచైతన్య 'జోష్' చిత్రం ద్వారా తెలుగులోకి అడుగుపెట్టిన సీనియర్ నటి రాధ కుమార్తె కార్తీకకు ఆ చిత్రంలో నటిగా ఓ మోస్తరు మార్కులే పడ్డాయి. సినిమా సైతం బాక్సాఫీస్ ను ఆకట్టుకోకపోవడంతో కార్తీక చేతిలో కొత్త సినిమాలు లేవు. ఈ క్రమంలో ఆమె తాజాగా మలయాళంలో అడుగుపెడుతోంది. ప్రఖ్యాత చిత్రకారుడు రాజా రవి వర్మ జీవిత చరిత్ర ఆధారంగా 'మకర మంజు' పేరుతో ఓ చిత్రం తెరకెక్కనుంది. ఇందులో కథానాయికగా కార్తీక ఎంపికైంది. ఆసక్తికరంగా రాజా రవి వర్మ పాత్రను ప్రముఖ ఛాయాగ్రాహకుడు సంతోష్ శివన్ పోషించనున్నారు.కెమెరామెన్ గా ఎన్నో అత్యద్భుత చిత్రాలను తెరకెక్కించిన సంతోష్ శివన్ కెమెరా ముందుకు వస్తుండటం ఇదే ప్రథమం. నిజానికి ఏడాది క్రితమే ఈ చిత్రానికి ప్లానింగ్ జరిగినప్పటికీ మణిరత్నం 'రావణ్' చిత్రానికి ఛాయాగ్రాహకుడుగా సంతోష్ శివన్ బిజీగా ఉండటంతో ఈ ప్రాజెక్ట్ కార్యరూపంలోకి రాలేదు. తాజాగా 'మకర మంజు' చిత్రానికి సంబంధించి ప్రీ-ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తయింది. వచ్చే వారంలో ఈ చిత్రం షూటింగ్ తిరువనంతపురంలో ప్రారంభమై తర్వాత షెడ్యూల్ గోవాలో జరుగుతుంది. మలయాళంలో తన కెరీర్ కు ఈ చిత్రం సరైన బ్రేక్ ఇస్తుందని కార్తీక ఆశాభావంతో ఉంది.
No comments:
Post a Comment