
'బ్లేడ్ బాబ్జీ', 'బెండు అప్పారావు' చిత్రాలు రెండూ 'బి' అనే అక్షరంతో ప్రారంభమై సక్సెస్ కావడంతో అదే సెంటిమెంట్ తో 'బెట్టింగ్ బంగార్రాజు'అనే టైటిల్ ను దర్శకనిర్మాతలు నిశ్చయించినట్టు తెలుస్తోంది. తొలుత ఈ చిత్రానికి 'సత్తుపల్లి బంగార్రాజు' అనుకున్నారట. ఈ చిత్రంతో పాటు కళాతపస్వి కె.విశ్వనాథ్ దర్శకత్వంలో రూపొందున్న తదుపరి చిత్రంలోనూ అల్లరి నరేష్ కథానాయకుడిగా ఎంపికయ్యారు. సింగీతం శ్రీనివాస్ దర్శకత్వంలో కొండా కృష్ణంరాజు నిర్మించతలబెట్టిన చిత్రంలోనూ అల్లరి నరేష్ హీరోగా నటించనున్నట్టు సమాచారం. అదనంగా రవితేజ కథానాయకుడుగా సముద్రఖని దర్శకత్వంలో బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న 'శంభో శివ శంభో' (తమిళ 'నాడోడిగళ్' రీమేక్) చిత్రంలో మరో కథానాయకుడుగా అల్లరి నరేష్ నటిస్తున్నారు
No comments:
Post a Comment