Monday, November 9, 2009

బూతు కాదు..రొమాంటిక్ లవ్

కిరణ్ రాథోడ్, మాస్టర్ కార్తీక్ ప్రధాన పాత్రధారులుగా నరసింహ నంది దర్శకత్వంలో ఐశ్వర్య ఫిలింస్ పతాకంపై మల్లన్న నిర్మిస్తున్న రొమాంటిక్ లవ్ సెన్సిబుల్ చిత్రం 'హైస్కూలు'. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. ప్రముఖ దర్శకుడు బి.గోపాల్ ఆడియో సీడీని ఆవిష్కరించి తొలి ప్రతిని దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజకు అందించారు. సాకేత్ సాయిరామ్ సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో సుప్రీం మ్యూజిక్ ద్వారా మార్కెట్ లోకి విడుదలైంది

బి.గోపాల్ మాట్లాడుతూ, సాకేత్ సాయిరామ్ అందించిన పాటలన్నీ చాలా బాగున్నాయనీ, మాస్టర్ కార్తీక్ కు మంచి భవిష్యత్తు ఉందనీ అన్నారు. ఈ సినిమా క్లిప్పింగ్ చాలా బాగున్నాయనీ, చిత్ర దర్శకుడు నరసింహ నంది గతంలో '1940లో ఒక గ్రామం' అనే చక్కటి చిత్రాన్ని తీశారనీ తమ్మారెడ్డి భరద్వాజ పేర్కొన్నారు. దర్శకుడు నరసింహ నంది మాట్లాడుతూ, ఇది ఎంతమాత్రం బూతు సినిమా కాదనీ, రొమాంటిక్ లవ్ సెన్సిబుల్ చిత్రమని దర్శకుడు నరసింహ నంది తెలిపారు. ఇవాల్టి ట్రెండ్ కు అనుగుణంగా ఓ మంచి పాయింట్ తో ఈ చిత్రం తెరకెక్కిందని నిర్మాత మల్లన్న పేర్కొన్నారు. పాటలకు, రీరికార్డింగ్ కూ మంచి స్కోప్ ఉందనీ, దర్శకుడికి కూడా ఈ చిత్రం మంచి పేరు తెస్తుందనీ సాకేత్ సాయిరామ్ అన్నారు. తన చేత దర్శకుడు బాగా నటింపజేశారని మాస్టర్ కార్తీక్ అన్నారు. ఈ వేడుకలో దర్శకులు రాంప్రసాద్, వి.సముద్ర, నిర్మాత డిఎస్ రావు, నటుడు హర్షవర్దన్, బాబు సిద్ధంశెట్టి తదితరులు పాల్గొన్నారు

No comments:

Post a Comment