Wednesday, November 11, 2009

'జగద్గురు బాబా'కి ప్రశంసలు

కాలమాన పరిస్థితులను బట్టి ప్రజలను ఉద్దరించేందుకు అవతార పురుషులు భూమిపై అడుగుపెడుతుంటారు. ఆంగ్లేయుల దాస్య శృంఖలాల నుంచి విముక్తి పొందేందుకు జరుగుతున్న స్వాతంత్ర్య పోరాట సమయంలో నాటి హిందూ-ముస్లింల మధ్య ఐక్యతను సాధించేందుకు షిర్డీ సాయిబాబా అవతరించారు. ఆయన జీవిత విశేషాలను ఆధారంగా తీసుకుని నిర్మించిన చిత్రం 'జగద్గురు శ్రీ షిర్డి సాయిబాబా'. సాయిబాబాగా బి.వి.రెడ్డి నటిస్తూ నిర్మించిన చిత్రమిది. గూడ రామకృష్ణ దర్శకుడు. ఈ చిత్రం ప్రివ్యూ చూసిన పలువురు సినీ ప్రముఖులు ఎంతగానో అభినందించారని బి.వి.రెడ్డి తెలిపారు
ప్రముఖ నటుడు పద్మశ్రీ మోహన్ బాబు, సీనియర్ దర్శకుడు బి.గోపాల్ ఈ చిత్రం చూసి ప్రత్యేకంగా అభినందించారనీ, ఇంతవరకూ ఎవరకూ తెరకెక్కించని సాయిబాబా జీవితంలోని యదార్ధ సంఘటనలను ఈ చిత్రంలో తాము పొందుపరిచామనీ ఆయన చెప్పారు. ఈనెల 19న ఆంధ్ర రాష్ట్రమంతా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు తెలిపారు. దర్శకుడు రామకృష్ణ మాట్లాడుతూ, పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ఈ చిత్రం ప్రివ్యూ చూసి ప్రశంసించడం ఆనందంగా ఉందని అన్నారు. ముఖ్యంగా సెకెండాఫ్ చూసి పలువురు కంట తడి పెట్టారనీ చెప్పారు. తెలుగు ప్రేక్షకులు కూడా ఈ చిత్రాన్ని తప్పక అదిరించి, ఆశీర్వదిస్తారనే నమ్మకంతో ఉన్నట్టు తెలిపారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో సుమన్, శివకృష్ణ, నాగబాబు, నారాయణరావు, బ్రహ్మాజీ, రఘునాథరెడ్డి, రామిరెడ్డి, గుండు హనుమంతరావు, చిట్టిబాబు, రమాప్రభ, శివపార్వతి తదితరులు నటించారు. సుద్దాల అశోక్ తేజ, తైదలబాబు, డాక్టర్ పరిమి రామ నిర్సింహం పాటలు, శ్రీనివాసరెడ్డి సినిమాటోగ్రఫీ, మేనఘ శ్రీను ఎడిటింగ్, లలిత్ సురేష్ సంగీతం అందించారు


No comments:

Post a Comment