Friday, November 13, 2009

'జాయ్' గీతాలు

అవితేజ్, త్రినాథ్, పార్వతి, వైనవి హీరోహీరోయిన్లుగా ఇ.వి.కుమార్ సమర్పణలో అరుణై పిక్చర్స్ పతాకంపై ఇవివి కంబన్ నిర్మిస్తున్న యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ 'జాయ్'. బి.రాజా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. విద్యాసాగర్ సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. తమ్మారెడ్డి భరద్వాజ ఆడియో సీడీని ఆవిష్కరించి పరుచూరి గోపాలకృష్ణకు అందజేశారు. దర్శకురాలు బి.జయ, పాటల రచయిత భువనచంద్ర, ఇవివి కంభన్, దైవజ్ఞశర్మ, అవితేజ్, త్రినాథ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మధుర ఎంటర్ టైన్ మెంట్స్ ద్వారా ఆడియో విడుదలైంది
పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ, జాయ్ పోస్టర్లు చూస్తుంటే కాలేజీ కుర్రాళ్లు ఈ సినిమాలో నటించినట్టు అనిపించిందనీ, ఆడియోతో పాటు సినిమా కూడా విజయవంతం కావాలని కోరుకుంటున్నాననీ చెప్పారు. తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ, బి.జయ తన శిష్యురాలనీ, ఆయన వద్ద శిష్యరికం చేసిన బి.రాజా తన మనువడి లాంటివాడనీ అన్నారు. విద్యాసాగర్ తాను తీసిన చాలా సినిమాలకు సంగీతం అందించారని అన్నారు. మంచి యూత్ ఫుల్ టీమ్ తో రూపొందిన ఈ చిత్రం చక్కటి విజయం సాధించాలని కోరుకుంటున్నట్టు పేర్కొన్నారు. రాజా తన వద్ద రెండు సినిమాలకు పనిచేశారనీ, అప్పుడే అతనిలో దర్శకుడు కాగల సత్తా ఉందని అప్పుడే గ్రహించాననీ బి.జయ అన్నారు. రాజా దర్శకుడిగా సక్సెస్ కావాలని అభిలషించారు. ఈ చిత్రం తమకు మంచిపేరు తెచ్చిపెడుతుందని ఆశిస్తున్నట్టు హీరోలు అవితేజ్, త్రినాథ్ అన్నారు. చక్కటి కథతో తాము తీసిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తే తమ బ్యానర్ నుంచి మరిన్న చిత్రాలు వస్తాయని నిర్మాత కంబన్ చెప్పారు. 'జాయ్' సక్సెస్ జాయ్ ను అందించాలని అతిథులంతా అభిలషించారు

No comments:

Post a Comment