Friday, November 13, 2009

గోలిమార్ అంటున్న హన్సిక

పరిశ్రమలో గోల్డెన్ లెగ్ గా పేరున్న హన్సిక ఇప్పుడు టాలీవుడ్ లో వరుస అవకాశాలతో తన తోటి హీరోయిన్లకు గట్టిపోటీ ఇస్తోంది. 'దేశముదురు', 'కంత్రీ', 'బిల్లా' (గెస్ట్ రోల్), 'మస్కా', 'జయీభవ' చిత్రాల్లో ఇంతవరకూ నటించిన హన్సిక ప్రస్తుతం హీరో నితిన్ తో కలిసి 'సీతారాముల కల్యాణం..లంకలో' చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం తర్వాత మళ్లీ తన సినీ గురువు పూరీ జగన్నాథ్ చిత్రంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది
'ఏక్ నిరంజన్' చిత్రం తర్వాత వైష్ణో అకాడమీ బ్యానర్ పై పూరీ జగన్నాథ్ స్వీయ నిర్మాణ దర్శకత్వంలో ఓ కొత్త చిత్రాన్ని ఇటీవలే అనౌన్స్ చేశారు. ఇందులో గోపీచంద్ హీరో. దీనికి పూరీ స్టయిల్ లో 'గోలిమార్' అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఇందులో గోపీచంద్ కు జోడిగా నటించేందుకు హన్సిక అగ్రిమెంట్ చేసిందని తెలుస్తోంది. 'సీతారాముల కల్యాణం' షూటింగ్ పూర్తయిన వెంటనే కొత్త చిత్రంలోకి హన్సిక అడుగుపెడుతుంది. డిసెంబర్ లో ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి 2010 సమ్మర్ కానుకగా విడుదల చేయాలని పూరీ జగన్నాథ్ ప్లాన్ చేస్తున్నారు

No comments:

Post a Comment