తొలి చిత్రం 'గమ్యం'తో తెలుగు సినిమా నడకకు కొత్త అర్ధం చెప్పి, మనిషి-మానవీయ విలువలకు తన చిత్రం ద్వారా అద్దంపట్టిన రాధాకృష్ణ జాగర్లమూడి అలియాస్ క్రిష్ మంగళవారంనాడు మరో వసంతంలోకి అడుగుపెట్టారు. ఇటీవలే ఆయనకు 2008 సంవత్సరానికి ఉత్తమ దర్శకుడు ('గమ్యం' చిత్రానికి)గా నంది అవార్డు వరించింది. ఇదే ఉత్సాహంతో ఇప్పుడు తన రెండో సినిమా 'వేదం' కోసం పూర్తి ఆయన శక్తియుక్తులు కేంద్రీకరిస్తున్నారు. తొలుత దీనిని చిన్న చిత్రంగా తీయాలని అనుకున్నప్పటికీ భారీ స్టార్ కాస్ట్ వచ్చిచేరడంతో మల్టీసారర్ కమర్షియల్ లుక్ వచ్చింది. అల్లు అర్జున్, మనోజ్, అనుష్క, మనోజ్ బాజ్ పేయి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఆర్కా మీడియా సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోందిఈ చిత్ర ఇతివృత్తాన్ని క్రిష్ ఇంకా వెల్లడించనప్పటికీ వైవిధ్యమైన కథ-కథనాలతో కమర్షియల్ ఫార్మెట్ లో ఈ చిత్రం ఉంటుందని తెలుస్తోంది. ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు వచ్చింది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. చివరి షెడ్యూల్ త్వరలోనే ప్రారంభం కానుంది. జనవరిలో ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతుందని తెలుస్తోంది. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు
No comments:
Post a Comment