Wednesday, November 11, 2009

కృష్ణుడుకు భలే గిరాకీ!

'హ్యాపీడేస్' చిత్రంలో సీనియర్ బ్యాచ్ స్టూడెంట్ గా అందరి దృష్టిని ఆకట్టుకున్న కృష్ణుడు ఆ తర్వాత 'వినాయకుడు'తో ఫ్యాట్ హీరోగా పాపులర్ అయ్యాడు. ఆ చిత్రం సాధించిన విజయంతో ఇటీవల 'విలేజ్ లో వినాయకుడు'గా మరోసారి ఆయన ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సీక్వెల్స్ గురించి అంతగా తెలియని తెలుగు ప్రేక్షకులు ఈ చిత్రాన్ని కూడా అక్కున చేర్చుకున్నారు. విడుదలకు ముందే టేబుల్ ప్రాఫిట్ ను సొంతం చేసుకున్న నిర్మాతలు ఈ చిత్రం సాధిస్తున్న ప్రేక్షకాదరణ పట్ల హ్యాపీగా ఉన్నారు. దీంతో కృష్ణుడుకు సూటబుల్ అయ్యే కథలు అల్లడంలో ఇప్పుడు పలువురు కథకులు బిజీగా ఉన్నారు. ప్రస్తుతం కృష్ణుడు మూడు సినిమాలకు ఆయన కమిట్ అయినట్టు తెలుస్తోంది. కృష్ణుడు కథానాయకుడుగా నటించే తదుపరి చిత్రాన్ని ఎం.బాలమురుగున్, అనిల్ ఎస్ నాయర్ నిర్మిస్తున్నారు. భారతి గణేష్ దర్శకుడు. ఈ చిత్రానికి 'అమాయకుడు' అనే టైటిల్ ను నిర్ణయించారు. కృష్ణుడు సరసన అనన్య, గీతాసింగ్ హీరోయిన్లుగా నటించనున్నారు. మణికాంత్ కద్రి ('విలోజ్ లో వినాయకుడు' ఫేమ్) సంగీతం అందించనున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా రిలీజ్ చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు
కృష్ణుడు హీరోగా మరో కొత్త చిత్రాన్ని నిర్మించేందుకు పలువురు ఎన్ఆర్ఐలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం ద్వారా సపత్ పసుపర్తి అనే యువకుడు దర్శకుడుగా పరిచయం కానున్నారు. విలన్ పాత్రలతో ఆకట్టుకుంటున్న సుబ్బరాజు ఈ చిత్రంలో మరో హీరోగా నటించనున్నారనీ, ఓ తెలుగమ్మాయిని హీరోయిన్ గా పరిచయం చేయనున్నారనీ తెలుస్తోంది. వీటికితోడు 'జోష్' చిత్రం తర్వాత నాగచైతన్య కథానాయకుడుగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలోనూ కృష్ణుడు ఓ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు

No comments:

Post a Comment