Thursday, November 12, 2009

'కుర్రాడు' రివ్యూ

తెలుగు సినిమా 'కథ' ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కి అనే చందంలా మారుతోంది. నేలమీద నిలబడి సొంత కథలు తయారు చేసుకున్నప్పుడల్లా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. కథలు రాయించుకునే తీరిక లేని కొందరు పరభాషా చిత్రాల రైట్స్ కొనుక్కుని జనం ముందుకు వస్తున్నారు. అలాగని రీమేక్ ప్రక్రియ తప్పుకాదు. కాకుంటే టైటిల్ మార్చి, స్టార్ కాస్ట్ ఛేంజ్ చేసి పాత పాయింట్ నే తిరగదోడినప్పుడు ప్రేక్షకుడు అతాశుడవుతాడు. నిజానికి...అసలు ఒరిజనల్ వెర్షన్ ఎవరిదనేది ఒక్కోసారి అంతుపట్టని బ్రహ్మపదార్ధమవుతోంది. 'ది బైసికల్ తీఫ్', 'బీజింగ్ బైసికల్' వంటి సినిమాల నుంచి తమిళ కథకులు స్ఫూర్తి పొంది అప్పుడెప్పుడో 'పొల్లాదవన్' సినిమా తీశారు. ఆ సినిమా రీమేక్ హక్కులు తీసుకుని కొద్దిపాటి కామిడీ ట్రాక్ తగిల్చి ఇప్పుడు 'కుర్రాడు' చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. ఈ సినిమా మేకింగ్ లో ఉండగానే సరిగ్గా 'బైక్ తెఫ్ట్' (బైక్ దొంగతనం) అనే పాయింట్ తోనే 'రైడ్' చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. కాకుంటే అందులో ఇద్దరు హీరోలు. ఒకరు రఫ్ గా ఉండే మధ్య తరగతి యువకుడైతే, మరొకడు కుటుంబ బాధ్యతలున్న యువకుడు. ఇప్పుడు వచ్చిన 'కుర్రాడు'లో మాస్, క్లాస్ పాత్రలు రెండూ హీరోనే పోషించారు. రెండింటి కామన్ పాయింట్ మాత్రం బైక్ చోరీనే. నిజానికి వీటన్నింటి కంటే ముందే బైక్ చోరీ పాయింట్ మీద గోపీచంద్ 'తొలి వలపు' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కాకుంటే ఆ కథ కుటుంబ నేపథ్యం మీదే సాగుతుంది. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే...ఎవరిది ఒరిజనల్ కథో...ఎవరిది కాపీడ్ వెర్షనో కానీ...ఒకే పాయింట్ ను అటు తిప్పితిప్పి జనం మీదకు వదిలినప్పుడు ప్రేక్షకుడు నావల్టీకి నోచుకోడు. హీరో వరుణ్ సందేష్ 'హ్యాపీడేస్', 'కొత్తబంగారులోకం' తర్వాత యూత్ లో క్రేజ్ తెచ్చుకోవడం, ప్రముఖ దర్శకనిర్మాత గుణ్ణం గంగరాజు తనయుడు సందీప్ గుణ్ణం సినిమాటోగ్రాఫర్ గా (అమ్మచెప్పింది) పనిచేసి 'కుర్రాడు'తో దర్శకపగ్గాలు చేపట్టడం సహజంగానే ఈ సినిమాపై మంచి అంచనాలు కూడా ఏర్పడ్డాయి. మరి 'కుర్రాడు' నడక ఎలా సాగిందంటే...

No comments:

Post a Comment