Tuesday, November 10, 2009

మగధీర వేడుక గచ్చీబౌలిలో

తెలుగు సినిమా 78 ఏళ్ల చరిత్రను తిరగరాసి సరికొత్త రికార్డులు సృష్టించిన 'మగధీర' చిత్రం శతదినోత్సవాన్ని భారీ స్థాయిలో హైద్రాబాద్ లో నిర్వహించేందుకు చిత్ర నిర్మాత అల్లు అరవింద్, ఆయన కుమారుడు అల్లు శిరీష్ ప్లాన్ చేస్తున్నారు. రామ్ చరణ్ కథానాయకుడుగా ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మించిన ఈ చిత్రం తెలుగు సినీ చరిత్రలోనో అత్యధిక ప్రింట్లు, ప్రదర్శనలతో జూలై 31న విడుదలైంది. 14 దేశాల్లో 1200కు థియేటర్లలో ఈ చిత్రం విడుదలైంది. తొలివారంలో 22 కోట్లకు పైగా వసూలు చేసిన ఈ చిత్రం నూరు రోజుల నాటికి 80 కోట్లు దాటింది. శాటిలైట్, రీమేక్ రైట్స్ వంటివి కలుపుకొంటే 100 కోట్లు రాబట్టిన చిత్రంగా సెన్సేషన్సృష్టించింది
తెలగు సినిమా గత రికార్డులను అధిగమించి ఈ చిత్రం 302 సెంటర్లలో 50 రోజులు, ఇటీవల 223 సెంటర్లలో 100 రోజులు పూర్తి చేసుకుంది. ఇప్పుడు సిల్వర్ జూబ్లీ రికార్డుల దిశగా దూసుకుపోతోంది. ఈ చిత్రం సాధించిన ఆసాధారణ విజయాన్ని దృష్టిలో పెట్టుకుని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా శతదినోత్సవాన్ని జరిపేందుకు ప్లానింగ్ జరుగుతోంది. ఈనెల 15న హైద్రాబాద్ లోని గచ్చీబౌలీ స్టేడియంలో ఈ వేడుక జరుగనుందనీ, ఈ ఉత్సవానికి హాజరయ్యే మెగాభిమానుల కోసం కోస్తాఆంధ్ర నుంచి ఓ ప్రత్యేక రైలును హైద్రాబాద్ వరకూ ఏర్పాటు చేయనున్నారనీ తెలుస్తోంది

No comments:

Post a Comment